టీడీపీకే ఓటు వేస్తామంటే చావగొట్టారు

ఎన్నికల పోలింగ్‌కి ముందు, పోలింగ్ తర్వాత వైసీపీ గూండాలు చేస్తున్న దారుణాలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే వున్నామా అనే సందేహాలు కలిగిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానాలు కూడా ఏపీలో జరుగుతున్న దారుణాలు చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. జరక్కూడని దారుణాలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా వైసీపీ అనుకూల పోలీస్ అధికారులను బదిలీ చేస్తున్నారు. ఈ బదిలీలు జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలవా?

తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారన్న కోపంతో వైసీపీ గూండాలు బుధవారం నాడు ఒక కుటుంబం మీద దాడి చేసి దారుణంగా గాయపరిచాయి. విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ దారుణం జరిగింది. సుంకర ధనలక్ష్మి అనే మహిళ ఇంటికి పోలింగ్‌కి ముందు బొగ్గు శ్రీను నాయకత్వంలోని వైసీపీ గూండాలు వచ్చారు. వైసీపీకే ఓటు వేయాలని చెబుతూ డబ్బు ఇవ్వబోయారు. అయితే, ఆమె తమకు డబ్బు వద్దని, తాము తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తామని చెప్పారు. అయితే మీ సంగతి ఎన్నికల తర్వాత చూసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయిన లోకేష్, భాస్కర్, సాయి అనే వైసీపీ గూండాలు పోలింగ్ ముగిసిన తర్వాత ధనలక్ష్మి ఇంటి మీద దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో వున్న ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠలపై దాడి చేసి రాడ్లతో తలమీద, ఒళ్ళంతా కొట్టారు. దాంతో వాళ్ళు రక్తసిక్తం అయిపోయారు. ఇంట్లోనే వున్న రమ్య అనే గర్భిణిని తాను గర్భిణిని అని చెబుతున్నా వినకుండా కడుపు మీద కొట్టారు. తెలుగుదేశం నాయకులు ఆందోళన చేయడంతో వీరిలో ఒక నిందితుడు లోకేష్‌ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.