వైసీపీ పంచిన చీరలను విసిరికొట్టిన మహిళలు!

ఆంధ్రప్రదేశ్‌లో జనం నాడి, వేడి చూస్తుంటే అధికార పార్టీకి ‘ఏదో తేడాగానే’ వున్నట్టు అనిపిస్తోంది. కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు మహిళలకు చీరలను పంచారు. ఆ చీరలను ఆడపడుచులందరూ కలసి మూకుమ్మడిగా వెళ్ళి చీరలు పంచిన వైసీపీ నాయకుడి ఇంటిలోకి విసిరేసి ఎంచక్కా వచ్చేశారు. మహిళలను ఆపడానికి ప్రయత్నించిన సదరు వైసీపీ నాయకుడి ముఖం మీద చీరల వర్షం కురిసింది. ఈ ఎన్నికలలో మహిళాశక్తి ఏం చేయబోతోందో సదరు వైసీపీ నాయకుడికి స్పష్టంగా తెలిసింది. కొత్తపేట మహిళలు చేసిన పనిని అందరూ శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu