టీఆర్ఎస్ పై గుత్తా ఫైర్.. అవసరమైతే టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం


వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి దయాకర్ దాదాపు 3 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. దాదాపు దయాకర్ గెలుపు ఖాయమని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి, అధికార దుర్వినియోగంతోనే ఈ వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తోందని.. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని గుత్తా అన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటాం.. అవసరమైతే టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి తమ పార్టీ సిద్దంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మరి టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు రెడీ అయినా.. టీడీపీ అందుకు ఓకే చెపుతుందో లేదో.

కాగా వరంగల్ ఉపఎన్నికలో 10 రౌండ్ల లెక్క అనంతరం ఇప్పటివరకూ వచ్చిన ఓట్లు

టీఆర్ఎస్ - 4,66,386
కాంగ్రెస్ - 1,17,618
బీజేపీ - 85,655
వైసీపీ - 17,912