పాత కేసుల వెలికితీత.. టిడిపి హయాంలో భూ ఆక్రమణ చేసిన వారు జైలుకే!

 

టిడిపి ప్రభుత్వ హయాంలో విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయంటూ అప్పటి ప్రతిపక్షాలు  ఆందోళన చేయడంతో ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ అప్పటి జాయింట్ కలెక్టర్ సృజనతో పాటు మరికొంతమంది సభ్యులను భూ ఆక్రమణలపై  అదుపులోకి తీసుకొని విచారించారు. ఫైనల్ గా రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించినా.. దానిని బయటపెట్టలేదు ప్రభుత్వం.

కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ సిట్ వేస్తామని.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 22 న విశాఖ చేరుకున్న సిట్ టీమ్ సభ్యులు వీటిపైన దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా ఒక ఫార్మెట్ ను సిద్ధం చేసుకుంటామని 26 వ తేదీన నోటిఫికేషన ఇచ్చారు. నవంబర్ 1 నుండి 7 వ తేదీ వరకు పబ్లిక్ నుండి.. 8-9 తేదీల్లో ప్రజా ప్రతినిధుల నుండి.. సలహాలు, ఫిర్యాదులు తీసుకుంటామని ముందు ప్రకటించారు.  పాత సిట్ రిపోర్టును కూడా పరిశీలించి విశాఖ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 13 మండలాల్లో జరిగిన భూ ఆక్రమణలపైనా పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని ప్రకటించింది.

ప్రజలు నుండి వివిధ రూపాల్లో వచ్చినటువంటి ఫిర్యాదులను కూడా స్వీకరించారు. సిట్ కు సంబంధించి ప్రత్యేక ఫిర్యాదు ఫార్మెట్ తయారు చేసుకొని 13 మండలాలకు ప్రత్యేక కౌంటర్ లు పెట్టారు. వీటితో పాటు జిల్లాలు ఇతర మండలాలకు మరో 2 కౌంటర్ లు కూడా ఏర్పాటు చేశారు. వీటిలో సిట్..నాన్ సిట్ అని రెండు కౌంటర్లను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు 2,434 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో 944 మాత్రమే నాన్ సిట్ పరిధిలో ఉన్నట్టు మొదటగా గుర్తించామని తర్వాత మళ్లీ పున పరిశీలన చేసిన తర్వాత ఆఖరిగా 597 మాత్రమే నాన్ సిట్ గా.. 1,500 పైగా సిట్ పరిధిలోకి వచ్చినట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.ఫిర్యాదుల స్వీకరణలో ప్రైవేటు, పబ్లిక్ అన్ని కలిపి తీసుకుంటామని.. ఇందులో పబ్లిక్ ప్రైవేటు అనేది ముఖ్యం కాకుండా రిటైర్డ్,ట్యాంపరింగ్ దేనిలో ఉన్నా.. అవన్ని కూడా సిట్ పరిధిలోకి తీసుకువచ్చారు. అన్నింటిని పరిశీలించి 811 అప్లికేషన్స్ డిప్యూటీ కలెక్టర్ల అంశాల వారీగా పరిశీలించేందుకు ఇచ్చారు. చేంజ్ ఆఫ్ కాంప్లికేషన్, పొలిటికల్ సఫరర్స్, ట్యాంపరింగ్, ల్యాండ్ గ్రాబింగ్, వితౌట్ ప్రొసీజర్, ల్యాండ్ అలాట్ మెంట్ విభాగాలూ వర్గీకరించారు. 40 శాతం రికార్డుల ట్యాంపరింగ్, చేయింజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ 35 శాతం ,ఆక్రమణలు, భూకబ్జాలు 25 శాతం ఇతర అంశాల వారీగా ఉన్నాయని పూర్తి స్థాయిలో స్టాఫ్ ను తీసుకొని విచారిస్తామంటున్నారు. తమకు చర్యలు తీసుకునే అధికారం లేదని చర్యలను కూడా సిఫార్సు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామంటున్నారు.