పైథాన్ కడుపు చీలిస్తే.. మనిషి శవం బయటపడింది!
posted on Sep 10, 2022 12:51PM
నాన్న ఊరునించి రాగానే పిల్ల పరుగున వెళ్లింది. సూట్‌కేస్ తెరిచి పిల్లదానికి చాక్లెట్ ఇచ్చాడాయన. బాబాయి వచ్చినపుడు జేబులోంచి మరో చాక్లెట్ తీసిచ్చాడు. తల్లి పోపుల డబ్బాలోంచి పది రూపాయలు తీసి కాలేజీకి వెళ్లే అబ్బాయికి ఇచ్చింది. కానీ ఇండోనేషియాలో ఒక గ్రామస్తులు పైథాన్ కడుపులోంచి మనిషి మృతదేహాన్ని బయటికి తీశారు!
అనకొండ సినిమాలో పేద్ద అనకొండ జీపుల్లో వెళ్లేవారిని వెంటాడటం గుర్తుండే ఉంటుంది. చివరికి క్యాంప్ లో ఒక్కడిని చూసి అమాంతం చుట్టేసి చంపేస్తుంది. పెద్ద తెరమీద అతిపెద్ద పాము దృశ్యాన్ని చూసి ఒక్కింత అందరూ భయపడ్డారు. చీకట్టో వెళ్లేటపుడు పాము గాని అడ్డంగా పోయిందా, కాళ్లకేమైనా తగిలిం దా అని చాలారోజులు ఆ సినిమా ప్రభావంతో తిరిగారు అందరూ!
ఇండోనేషియా, సల్వేసీ ద్వీపంలో తోట పనిచేసేవారి హడావుడి ఎక్కువే. అక్కడే నివాసం ఉంటూ కాలం గడుపుతున్నారు. వారికి పాముపుట్రా భయం ఎప్పుడూ లేదు. కానీ హఠాత్తుగా ఆమధ్య ఓ అనకొండ వారి నివాస ప్రాంతాల్లోకి వచ్చేసింది. సైలెంట్‌గా ఒక వ్యక్తిని అమాంతం అరటిపండు మింగినట్టు మింగే సింది. తమతోపాటు నిన్నమొన్నా కలిసి పనిచేసిన అక్బర్ కనపడటం లేదని తోటపనివారంతా తెగ కంగారు పడి అంతా వెతికారు. ఎక్కడా కనపడలేదు. అప్పుడు ఒక వ్యక్తి ఒక పైథాన్ కదలకుండా పడుంది, అది ఎవరో మనిషిని మింగేసినట్టుంది. కడుపు దగ్గర మరీ ఎత్తుగా కనపడింది. అది బహుశా మీరు వెతికే అక్బర్ అయే ఉంటాడన్నాడు. అంతే పరుగున పెద్దవాళ్లు, నలుగురు యువకులు అటు వెళ్లారు. పైథాన్ మనిషి ని మింగగానే కొంతసేపు అలసిపోయినట్టు పడుకుంటుంది. వీళ్లు వెళ్లింది సరిగ్గా అలాంటి సమయం లోనే. అందుకే వీరి మీద అది దాడి చేయక పడుకునుంది.
అంతే వెంటనే పెద్ద పెద్ద కత్తులు తీసి మావాడినే మింగేస్తావా.. అంటూ దాని పొట్టని చీల్చి అక్బర్ శరీరా న్ని బయటికి తీశారు. ఒక మనిషిని బతికి ఉండగానే అమాంతం పైథాన్ మింగేయడం ఇదే మొదటి సారిట. పైథాన్ అతన్ని మింగగానే దాని శరీరంలో ఆహారాన్ని మెత్తగా చేసే జ్యూస్ ఉత్పన్నమవుతాయి. కానీ అందుకు కొంత సమయం పడుతుంది. కనుక గ్రామస్థులకు దాని పొట్ట చీలిస్తే మరణించిన అక్బర్ శరీరం దొరికింది. అందుకు సంతోషించారు.