మంచి వర్షాలు కురవాలంటూ టీటీడీ వరుణయాగం

జూన్ నెల ప్రారంభంకావడం..నైరుతి రుతుపవనాలు కేరళను తాకే సమయం దగ్గరపడుతుండటంతో మంచి వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్ధిస్తూ వరుణదేవుడి అనుగ్రహం కోసం టీటీడీ వరుణయాగం నిర్వహిస్తోంది. పాపవినాశనం మార్గంలో పార్వేట మండపం వద్ద గల గోగర్భ తీర్థంలో రుత్వికులు శాస్త్రోక్తంగా ఈ వరుణ యాగం ప్రారంభించారు. దీంతో పాటు పాటు మహానిష్ణాతులైన రుత్వికులతో శ్రీవరహస్వామి వారి ఆలయంలో వరుణ జపం, ఆస్థాన మండపంలో విరాటపర్వ పారాయణాన్ని నిర్వహించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu