రేపటి నుంచి  వారాహియాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర రేపటి నుంచి(అక్టోబర్ 1) ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్రను వపన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.మరోవైపు కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు వారాహి యాత్ర కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలో బహిరంగసభ జరగనుంది. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2వ తేదీన జిల్లా నేతలతో సమావేశంలో, 3న జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. 4, 5 తేదీల్లో పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. మరోవైపు టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈసారి వారాహి యాత్రలో ఆ పార్టీ శ్రేణులు కూడా పాల్గొననున్నాయి. టీడీపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించి మూడు విడతలు పూర్తి చేశారు. పవన్ కల్యాణ్ యాత్ర ఎక్కడ పెట్టినా ఎవరూ జన సమీకరణ చేయాల్సిన పని లేదు. ఆయన పవర్ స్టార్. అదీ గోదావరి జిల్లాల్లో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన వారందరూ ఓట్లేస్తారా లేదా అన్నదానిపై పవన్ కల్యాణ్ తనకు తానే సెటైర్లు వేసుకున్నా.. ఆయన జనాకర్షణ మాత్రం మాస్. అయితే గతంలోలా కాదు .. ఈ సారి ఆయన  వారాహి యాత్ర రాజకీయంగా ప్రకంపనలు సృష్టించనుంది.  ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో ఎదురుదాడి వస్తోంది. ఆయనను  ఓ సామాజికవర్గానికి పరిమితం చేయాలని.. ఆయనకు మద్దతు ఉంటుందని భావిస్తున్న వర్గంలో చీలిక కోసం ఇలాంటి ఎదురుదాడి వైసీపీ చేస్తోందన్న భావన బలంగా ఏర్పడుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu