వల్లభనేని వంశీకి వరుసగా షాక్ లు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

 గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి శుక్రవారం ఎస్సీ  ఎస్టీ కోర్టులో షాక్ తగిలింది. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిన్న సిఐడి కోర్టు  వంశీకి బెయిల్ ఇవ్వడానికి   నిరాకరిస్తే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు  ఇవ్వాళ వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బాధితుడు సత్యవర్దన్ తరపు న్యాయవాది వంశీకి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు.  నిందితుడు నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వంశీకి బెయిల్ ఇస్తే సత్యవర్దన్ ప్రాణాలకు హాని ఉందని పేర్కొన్నారు.  రిమాండ్ లో ఉన్న తన క్లయింట్ కు బెయిల్ ఇవ్వాలని వంశీ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.  వరుసగా రెండ్రోజులు రెండు ప్రత్యేక కోర్టులు వంశీకి బెయిల్ ఇవ్వకపోవడంతో చర్చనీయాంశమైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎపి పోలీసులు వంశీని హైద్రాబాద్ లో అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ కేసు నడుస్తుండగానే సిఐడి పోలీసులు గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.