మహమ్మారి ఎఫెక్ట్... ఇక ఆకలి చావుల కోరలలో ప్రపంచం
posted on Nov 21, 2020 11:22AM
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం బిక్కుబిక్కుమంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహమ్మారి కారణంగా మరో పెను ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. ప్రభుత్వాలు కనుక వెంటనే అప్రమత్తం కాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో పాటు ప్రపంచం మొత్తం వచ్చే ఏడాది ఆకలి చావులలో చిక్కుకుంటుందని ఐరాసకు చెందిన డబ్ల్యూఎఫ్‌పీ (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లే హెచ్చరించారు. ఈ విషయం పై వెంటనే ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని.. ఇప్పటికే కరోనా కారణంగా చాలామంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, ఆర్థిక వ్యవస్థలు కూడా తలకిందులయ్యాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రజలు ఆకలి చావుల్లో చిక్కుకోకుండా ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని అయన కోరారు. అంతేకాకుండా కరోనా సెకండ్ వేవ్ తో చాలా దేశాలు మళ్ళీ లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయని.. మరికొన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయని డేవిడ్ బీస్లే తెలిపారు.