12 మంది భార్యలు... 102 మంది పిల్లలు.. ఇక చాలు బాబు!

పెళ్లిళ్లలో కాదు కానీ.. పిల్లల విషయంలో గిన్నిస్ రికార్డు సాధించాలనుకున్నాడో ఏమో కానీ ఉగండాకు చెందిన ఓ వ్యక్తి 12 పెళ్లిళ్లు చేసుకుని ఏకంగా 102 మంది పిల్లల్ని కన్నాడు. ఇంకా ఇంకా కావాలని అనుకుంటున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఇక పెళ్లిళ్లకు, పిల్లలకుఫుల్ స్టాప్ పెట్టేశానంటున్నాడు.

ఇప్పుడు తన పెద్ద కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒంట్లో చేవ ఉన్నంత వరకూ కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటాననీ, అయినా ఇంత పెద్ద కుటుంబాన్ని సాకాలంటే సాయం కావాలి కదా మరి అంటున్నాడు.

అతనికి 102 మంది పిల్లలు ఉన్నారు.. వాళ్లల్లో చాలా మందికి వివాహాలయ్యాయి. వాళ్లకీ పిల్లలుపుట్టేశారు. అతగాడు తాత కూడా అయిపోయాడు. ఔను అతగాడికి 568 మంది మనవళ్లు ఉన్నారు. ఇంతకీ అతడి వయస్సు ఎంతంటారా? జస్ట్ 67 ఏళ్లు.

ఇంతకీ అతడి పేరేంటో చెప్పలేదు కదూ.. అతడి పేరు ముసా హసహ్యా. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబాన్ని సాకడానికి ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు.