టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూశారు. పెళ్లి నిశ్చయమై శుభ లేఖలు  పంచడానికి వెళ్లి  గుండెపోటుకు గురైన చంద్రమౌళి రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం      (డిసెంబర్ 21)కన్నుమూశారు.  

ఆదివారం గుండెపోటుకు గురైన చంద్రమైళి  చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు ఎక్మో సహా పలు ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది.

చంద్రమౌళికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, టిటిడి చెన్నై సలహామండలి అధ్యక్షుడు శేఖరరెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలో వీరి వివాహం జరగాల్సిఉంది. ఆ వివాహ శభ లేఖలు పంచడానికి ఆదివారం కారులో బయలు దేరిన చంద్రమౌళి  గుండె పోటుకు గురయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu