తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
posted on Aug 24, 2025 10:26AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. నిన్నశనివారం దర్శనానికి 24 గంటల సమయం పడితే.. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. నిన్న శ్రీవారిని 83,858 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చిందని టీటీడీఅధికారులు తెలిపారు.
నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్మనం టికెట్లు ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం అదే నెల సంబంధించి వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. నిన్న వృద్ధులు , దివ్యాంగుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులు దళారులను నమ్మవద్దని వైబ్‌సైట్ లేదా యాప్‌లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.