టీఆర్ఎస్ నాయకుల కిడ్నాప్

 

ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లో ఆరుగురు టీఆర్ఎస్ నాయకులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చర్ల మండలం పుసుగుప్ప అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కిడ్నాప్‌కి గురైన వారిలో భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ మానే రామకృష్ణ, చర్ల మండల టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేష్, వాజేడు మండల నాయకులు జనార్దన్, సత్యనారాయణ వున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లను నిలిపివేయాలన్న డిమాండ్‌తో మావోయిస్టులు ఈ కిడ్నాపులు చేశారు. ఈ మేరకు మావోయిస్టుల రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖను విడుదల చేశారు.