బీహార్ రైలు ప్రమాదంలో 35 మంది మృతి
posted on Aug 19, 2013 5:13PM
సోమవారం ఉదయం బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సహార్సా నుంచి పాట్రా వెళ్లే రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున భమారా రైల్వే స్టేషన్ల్‌లో ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తున్న ట్రైన్ ప్రయాణికుల మీదకు దూసుకెళ్లడంతో 12 మంది అక్కడిక్కడే మరణించారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు డ్రైవర్‌ను లాగి కొట్టారు. కొన్ని భోగిలకు నిప్పు పెట్టారు. అయితే మరణించిన వారులో ఎక్కువగా మహిళలు చిన్న పిల్లల ఉన్నారు.
కొంత మంది శివ భక్తులు పట్టాల మీద నిలబడి ఆందోలన చేస్తుండగా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ఆ ట్రైన్‌కు అక్కడ స్టాప్ లేకపోవడంతో ట్రైన్ చాలా వేగంగా వచ్చింది దీంతో ఆందోళనను గుర్తించినా ట్రైన్‌ను ఆపలేక పోయారు అందువల్లే ప్రాణ నష్టం అదికంగా సంభంవించింది. ఈ ప్రమాదం తో ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పటికే మృతుల సంఖ్య 35 కు చేరగా మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.