పిల్లలను టార్చర్ చేస్తే నేరస్తులౌతారు
posted on Nov 9, 2024 10:50AM
జాఫర్ బాయ్ కొడుకు ఫజల్ బాబా డ్రగ్స్ కు అలవాటయ్యాడు. ఆందోళన చెందిన జాఫర్ భాయ్ కొడుకును ప్రతీరోజు చితకబాదేవాడు. ఫజల్ బాబా తల్లి జాఫర్ భాయ్ ను వెంటపెట్టుకుని ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చింది. డ్రగ్స్ కు అలవాటుపడ్డ నా కొడుకును సన్మార్గంలో ఎలా పెట్టాలి అని మౌలానాను అడుగుతుంది
ఫజల్ బాబా తల్లి: సలాం వాలేకూం మౌలానా సాబ్. మేరా బేటా డ్రగ్స్ కా షికార్ బన్ గయా, హర్ దిన్ బాప్ సే మేరా బేటాకా పిటాయ్ హోరా
మౌలానా: వాలేకుం సలాం... తల్లిదండ్రులు పిల్లలను సన్మార్గంలో పెట్టే ప్రయత్నంలో హింసించకూడదు. ప్రేమతో నచ్చజెప్పాలి. ఫజల్ బాబా ప్రెండ్స్ అనేక సార్లు డ్రగ్స్ రాకెట్ లో పట్టు బడ్డారు. మీరు అప్పుడే కంట్రోల్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు.పిల్లలను చులకన చేసే అధికారం తల్లిదండ్రులకు కూడా లేదు. సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. చెడు వ్యసనాలకు అలవాటుపడిన పిల్లలను ప్రేమతో నచ్చజెప్పాలి. పిల్లలను అవమానపరచడం సరికాదు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మౌనంగా ఉండాలి. ఎక్కువగా వాదులాడుకోవద్దు. అప్పుడే పిల్లలు అరవడం చేయరు. సంస్కారం అతి ముఖ్యం. పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే ముఖ్యభూమిక వహిస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. ప్రతీ ఒక్కరితో సంస్కారవంతంగా మాట్లాడాలి.ఈ విషయాలను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. నా కొడుకు ఈ తప్పు చేశాడు. ఆ తప్పు చేశాడు అని ఫిర్యాదులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు నొచ్చుకుంటారు. తండ్రి మీద పిల్లలకు ఎక్స్ పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. పిల్లల మీద ఫిర్యాదులు చేయడం వల్ల నిరాశావాదం వచ్చేస్తుంది. పిల్లలకు గౌరవం ఇవ్వాలి. పిల్లలను అమితంగా ప్రేమించాలి. పిల్లలకోసం టైం కేటాయించాలి.
పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉన్నప్పటికీ కూతురు పెళ్లి చేసే బాధ్యత పూర్తిగా తండ్రికే ఉంటుంది. పిల్లలకు రెండేళ్ల వరకు పాలివ్వడం తల్లి పూర్తి బాధ్యత. ఖురాన్ ప్రకారం రెండేళ్లవరకు పిల్లలకు పాలు పట్టడం తల్లి బాధ్యత. పిల్లల విషయంలో తండ్రి స్నేహితుడి మాదిరిగా ఉండాలి గౌరవం ఏ మాత్రం తగ్గకూడదు. అదే తల్లి ప్రేమను ఎక్కువ పంచుతుంది. నవమాసాలు మోస్తుంది అంతే కాదు ప్రసవం సమయంలో అనేక నొప్పులు భరిస్తుంది. రెండేళ్లవరకు పిల్లలకు పాలివ్వడం అన్నీ కలిపి 30 నెలలు తల్లి బాధ్యత తీసుకుంటుంది. తండ్రి మాత్రం పిల్లలను ప్రయోజకులను చేసే వరకు పోషణ బాధ్యతలు తీసుకుంటాడు. కూతుళ్ల పెళ్లిళ్లు చేసే వరకు తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. పిల్లలను టార్చర్ చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ పర్సెంటేజ్ తక్కువ అని చెప్పాలి. పిల్లలను మార్చే ప్రయత్నంలో తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నారు. స్నేహితుల వల్ల ఎక్కువగా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారిపై నిఘా పెట్టాలి. డబ్బు సంపాదించిన తండ్రి కంటే ఇస్లాంను అమలు చేస్తున్న వ్యక్తులే మహనీయులు అని చెప్పాలి.
బదనపల్లి శ్రీనివాసాచారి