పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది.. గురుడు మరో పెళ్ళికి రెడీ అయ్యాడు.. 

దురాశ దుఃఖానికి చేటు అన్నారు. ఏదైనా సరే మన దగ్గర ఉన్న దానితోనే సంతృప్తి పడాలని కూడా మన పెద్దలు ఎప్పుడు చెపుతుంటారు. చాలా మంది, వాళ్ళకు ఉన్నదానితో సంతోషపడక వాళ్ళ దగ్గర లేనిది, వాళ్లకు దొరకని దానికోసం ట్రై చేస్తుంటారు. అలా ట్రై చేసి చివరికి బోల్తా పడుతుంటారు. అప్పుడే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా లాంటి పాటలు వినిపిస్తుంటాయి. తాజాగా  ఒక వ్యక్తి ఇలాగే బోల్తా పడ్డాడు ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకుందామా? 

అది హైదరాబాద్.  పహాడిషరీఫ్ ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావిద్ అనే వ్యక్తికి పెళ్లి అయింది. తన భార్య తనకు వంశోధరకుడిని ఇవ్వడానికి పండంటి బిడ్డకు జన్మ నిచ్చెనందుకు పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇదే  అదునుగా భావించి జావిద్ ఏకంగా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. భార్య పుట్టింటికి వెళ్లగానే సంబంధాలు చూసుకుంటే వేట మొదలెట్టాడు ఈ పెళ్లి రాయుడు. ఈ క్రమంలో కింద మీద పడి  హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఒక యువతితో వివాహం ఖాయం చేసుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మొదటి భార్య చెవిలో పడింది. 
 
కట్ చేస్తే.. జులై 25న కొత్త పెళ్లిచేసుకోటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈసంగతి తెలిసిన మొదటి భార్య కుటుంబీకులు కొత్త పెళ్లి కూతురు కుటుంబానికి జావిద్ సంగతి తెలిపారు.దీంతో జావిద్ అసలు రంగు  బయటపడంది.  ఆ విషయం వినగానే అగ్గిమీద గుగ్గిలంలా కోపంతో రగిలిపోయిన కొత్త పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు. జావిద్‌ను ఇంటికి రమ్మని  మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. పెళ్లి వారు పిలుస్తున్నారనే ఉత్సాహంతో సంకలు గుద్దుకుంటూ కొత్త పెళ్లి కూతురు ఇంటికి వెళ్లాడు జావేద్. ఇంకా అంతే జావిద్‌ను పట్టుకుని పహాడిషరీఫ్ పోలీస్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.