తెలుగువన్‌ నుంచి మరో సంచలనం – TONEFLIX యాప్

 

రెండు దశాబ్దాల క్రితం ఇంటర్నెట్‌ ఓ పద్మవ్యూహం. దూరం నుంచి సరదాగా చూడటమే తప్ప ఎవరూ అందులోకి ప్రవేశించే ధైర్యం చేసేవారు కాదు. కానీ అదే ఇంటర్నెన్‌ మున్ముందు ప్రపంచాన్ని శాసించబోతోందని ఊహించింది Object One సంస్థ. ఆ ఊహకి రూపాన్నిస్తూ Telugu Oneని స్థాపించింది. అలా మొదలైన Telugu One ప్రయాణం ఇప్పుడో చరిత్ర. తెలుగువన్ వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్‌, ఆన్‌లైన్ రేడియో TORI, పిల్లలకు ప్రత్యేక వెబ్‌సైట్‌ కిడ్స్ వన్‌... ఇలా అడుగుపెట్టిన ప్రతి మాధ్యమంలోనూ తనదైన ముద్ర వేసింది Telugu One సంస్థ. Telugu one ఊహించినట్లుగానే ఇప్పుడు ప్రపంచమంతా వార్తలు, వినోదం, విజ్ఞానం కోసం ఇంటర్నెట్ మీదే ఎక్కువగా ఆధారపడుతోంది.

 

ప్రేక్షకుల అవసరాలను గమనిస్తున్న Telugu One ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలకు సిద్ధపడుతోంది. ఇప్పుడు Toneflix APP పేరుతో ఒక విప్లవానికి తెర తీయబోతోంది. ఎలాంటి ఇంటర్నెట్, GSM అవసరం లేకుండానే వీడియోలను షేర్‌ చేసుకోవడమే Toneflix ప్రత్యేకత! మధ్యతరగతి ప్రజలు డేటా కోసం రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ యాప్‌ ద్వారా అద్భుతమైన వినోదాన్ని పొందవచ్చు. ప్రయాణాలలో అలసట లేకుండా గడిపేయవచ్చు. Near field communication technology ఆధారంగా, స్వీడన్ సంస్థ భాగస్వామ్యంతో ఈ Toneflix APPను రూపొందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఈ APPను ఈ నెల 23న విజయవాడలో ఆవిష్కరించనున్నారు.

 

ఆంద్రప్రదేశ్ పంచాయితీరాజ్ మరియు ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ యాప్ లాంచ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (IT) శ్రీ కె. విజయానంద్ ఐఏఎస్ గారు, ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎమ్. మాల కొండయ్య ఐపీఎస్ గారు ప్రత్యేక అతిధులుగా విచ్చేస్తున్నారు. తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కంఠంనేని రవిశంకర్ గారు మరియు యాప్ తయారీలో తెలుగువన్ తో భాగస్వాములైన స్వీడన్ కి చెందిన 'టెరా నెట్' కంపెనీ అధికార ప్రతినిధులు శ్రీ ఆరియో గోల్షెనాస్, లుడ్విగ్ హాన్సన్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

Toneflix APP వినోదరంగంలో ఓ సరికొత్త సంచలనానికి దారితీయబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదమో!