రేవంత్‌రెడ్డిపై మరో కేసు
posted on Jun 26, 2016 4:09PM

టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ నేత మన్నె గోవర్థన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిన్న మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రేవంత్ మాట్లాడుతూ..కేసీఆరే ఆంధ్రావాళ్లతో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. చండీయాగానికి చంద్రబాబు, వెంకయ్యను పిలిచారని, ఇలా అందరూ ఆంధ్రావాళ్లనే పిలిచారని, తెలంగాణ కోసం పాటుపడిన ఏ ఒక్కరినీ పిలవలేదన్నారు. తెలంగాణ కోసం అడ్డుపడ్డవాళ్లే ఆయనకు ఆత్మీయులయ్యారన్నారు. దీనిపై స్పందించిన గోవర్థన్ రేవంత్‌పై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 504, 290, 188 సెక్షన్ల కింద పోలీసులు రేవంత్‌పై కేసు నమోదు చేశారు.