తెలంగాణ రాష్ట్రం న్యాయమైన ఆకాంక్ష.. అందుకే మద్దతు...
posted on Aug 21, 2014 11:08PM
.jpg)
‘ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజల న్యాయమైన కోరిక అందుకే భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయన ఒక బహిరంగ సభలో షా ప్రసంగించారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను బీజేపీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విభజించిందని, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మాత్రం యుపీఏ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని ఆయన అన్నారు. తెలంగాణ అమరవీరులకు అమిత్ షా బీజేపీ తరఫున ఘన నివాళులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నిజాంను తరిమికొట్టిన ఘనత పటేల్‌దేనని, పటేల్ లేకుంటే భారత్‌లో హైదరాబాద్ విలీనం అయ్యేదికాదని అమిత్ షా అన్నారు. సర్దార్ పటేల్ లక్ష్యాన్ని నరేంద్ర మోడీ పూర్తి చేస్తారన్న ఆశాభావాన్ని షా వ్యక్తం చేశారు.