పంచాయతీ పంచాయితీ!.. గ్రామాల్లో ఉద్రిక్తతలు.. విషాదాలు!

తెలంగాణలో పంచాయతీల పంచాయితీ జోరుగా ఉంది. స్థానిక ఎన్నికల సందర్బంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో రాజకీయ వేడి పెచ్చరిల్లింది. పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగకపోయినా.. పొలిటికల్ యాక్టివిటీ మాత్రం రసకందాయంలో పడింది. అదలా ఉంచితే.. తెలంగాణలో   పంచాయతీ ఎన్నికల పంచాయితీ పలు గ్రామాలలో ఉద్రిక్తతలకు, మరికొన్ని గ్రామాలలో విషాదాలకూ దారి తీశాయి.  నామినేషన్ల విషయంలో తలెత్తిన విభేదాలతో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, కొన్ని కుటుంబాలలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.  అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై అంటే సై అంటున్న ఉదంతాలూ  ఉన్నాయి. 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు. ఈ విషయమై ఇంట్లో  ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన  తల్లి మందుల లక్ష్మమ్మ (40) ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. అయితే ఆమె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త చెబుతున్నాడు. ఇదే విషయాన్ని ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలోవార్డు మెంబర్‌గా నామినేషన్ వేసినందుకు భర్త మంద లించడంతో లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu