పార్టీ మారిన వారికి ఓటుహక్కు కల్పించవద్దు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కుపై ఆరాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక పార్టీ నుండి మరో పార్టీకి మారిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించవద్దని హైకోర్టులో పిటిషన్ వేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల, ధర్మారెడ్డి, మంచిరెడ్డి లాంటి పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఓటుహక్కు కల్పించవద్దని, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు ద్విపౌరసత్వం ఉన్నందున ఆయన్ని ఓటు వేయడానికి అనర్హుడిగా పరిగణించాలని పిటిషన్ లో కోరారు.