పార్టీ ఫిరాయించినా ఓటు వేయొచ్చు.. హైకోర్టు

కాంగ్రెస్, తెదేపా నుండి పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు విచారణ జరిపి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల ఓటుహక్కు వినియోగం పై జోక్యం చేసుకోలేమని, వారు ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని, అది సభాపతి తుది నిర్ణయమని స్పష్టం చేసింది. తరువాత విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.