సీఎం రేవంత్ జపాన్ పర్యటన.. లక్ష్యం ఏమిటో తెలుసా?

 

రాష్ట్రానికి పెట్టబడును ఆకర్షిండమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు రెడీ అయ్యారు. బుధవారం (ఏప్రిల్ 16) రాత్రి ఆయన జపాన్ పర్య టనకు బయలుదేరనున్నారు.    సీఎం రేవంత్ రెడ్డి  ఈ నెల 22 వరకు అంటే ఆరు రోజుల పాటు రేవంత్ జపాన్ లో పర్యటిం చనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట   మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారుల బృందం కూడా ఉంటుంది.  

ఈ పర్యటనలో భాగంగా ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అభివృద్ధిపై జపాన్ పర్యటనలో రేవంత్ బృందం అధ్యయనం చేయనుంది.  అలాగే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతికతను అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి పారిశ్రామికవేత్తలను, సంస్థలను ఆహ్వానించనున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu