కాగితకు తప్పిన ప్రమాదం

 

tdp padayatra, kagita venakt rao tdp, political news, telugu political news

 

 

ఇంటింటా టిడిపి కార్యక్రమంలో భాగంగా బంటుమిల్లిలో పాదయాత్ర చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాగిత వెంకట్రావు నీరసంతో కుప్పకూలిపోయారు. ఉదయం నుంచి హుషారుగా ఇంటింటికి తిరిగి ప్రజలను పలకరించి సమస్యలు తెలుసుకున్న ఆయన ఎండా వేడిమికి నీరసపడ్డారు. చెక్కెర మోతాదు తగ్గిపోవడంతో పాటు రక్తపోటు అధికమవడంతో నడుస్తూనే బంటుమిల్లి జూనియర్ కళాశాల వద్ద రోడ్డుపై పడిపోయారు. పక్కనే ఉన్నవారు ఆయనకు నేలదెబ్బ తగలకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆయనకు వెంటనే ప్రథమ చికిత్స చేశారు. ఆయన కోలుకున్న తరువాత మెరుగైన వైద్య చికిత్స కోసం మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రి కి తీసుకెళ్ళారు. ఆయన ఆరోగ్యం కుడుతపడే వరకూ ఆసుపత్రి లో ఉండాలని వైద్యులు సూచించారు.



బంటుమిల్లిలో పాదయాత్ర చేస్తున్న కాగిత వెంకట్రావు దృష్టికి ప్రజలు అనేక సమస్యలు తీసుకొని వచ్చారు. తాగు నీటి సమస్య మీద ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు, డ్రైనేజీలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉపాది హామీ తదితదర అంశాలలో పిర్యాదులు అందాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu