వైసీపీలో అప్పుడే వాటాల బాగోతం మొదలైంది!!
posted on Jul 18, 2019 5:48PM

వైసీపీ ప్రభుత్వంలో అప్పుడే వాటాల బాగోతం మొదలైందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఇసుక కోసం వైసీపీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కొట్టుకునే పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, గుమ్మడి సంధ్యారాణితో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన రౌడీయిజాన్ని నెల్లూరులో చూపించుకోవాలని రాజేంద్రప్రసాద్ హితవు పలికారు.
బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రౌడీల మాదిరిగా మండలిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అవినీతిలో పుట్టి, అవినీతిలో పెరిగి, అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. క్యూసెక్కుకు, టీఎంసీకి తేడా తెలియని వ్యక్తి జలవనరుల శాఖ మంత్రి అంటూ అనిల్ కుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.