కర్నూలులో తెదేపా కార్యకర్త హత్య
posted on May 6, 2015 6:39AM
గత రెండుమూడేళ్ళుగా కొంచెం ప్రశాంతంగా కనిపించిన రాయలసీమలో మళ్ళీ ఫాక్షన్ హత్యలు మొదలయినట్లున్నాయి. వారం రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వై.యస్సార్.కాంగ్రెస్ నేత బి. ప్రసాద రెడ్డి హత్యతో రాష్ట్రం ఉలిక్కిపడింది. రాష్ట్రంలో నానాటికి పెరిగుతున్న రాజకీయ హత్యల గురించి ఆ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్ కి పిర్యాదు కూడా చేసారు. దానిపై అధికార పార్టీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.
ఆ రెండు పార్టీల మధ్య ఈ హత్యల గురించి మాటల యుద్ధం నడుస్తుండగానే మళ్ళీ నిన్న కర్నూల్ జిల్లా కౌతాళం మండలం నదిచాగి గ్రామంలో టిడిపికి చెందిన ఈరన్న, అతని కుమారుడు మరో నలుగురు తెదేపా కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడులలో ఈరన్న అక్కడికక్కడే మరణించగా అతని కుమారుడితో సహా మిగిలినవారికి తీవ్ర గాయాలయ్యాయి. వైకాపాకు చెందినవారే ఈ దాడికి పాల్పపడినట్లు భాదితులు చెపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మళ్ళీతలెత్తుతున్నఈఫాక్షన్ గొడవలను, హత్యలను రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయకపోతే దాని వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.