మా బాధ తెలియాలనే పిల్లల్ని చంపాం..

 

పాకిస్థాన్ మిలటరీ తమ కుటుంబాలపై దాడులు చేస్తోందని, అందుకు ప్రతీకారంగానే పెషావర్‌లోని సైనిక స్కూలు మీద దాడి చేసి పిల్లలను చంపామని తాలిబన్లు ప్రకటించారు. తమ కుటుంబ సభ్యుల మీద దాడులు చేస్తే తమకు ఎంత బాధ కలుగుతోందో చెప్పడానికే తాము స్కూలు మీద దాడి చేసి సైనికుల పిల్లల్ని చంపామని చెప్పారు. అలాగే ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో సైనిక చర్యకు ప్రతీకారంగానే ఇలా చేశామని తాలిబన్ నాయకులు చెప్పారు. అయితే తాలిబన్లు చేసిన ఈ దురాగతానికి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. తాలిబన్ల ఈ చర్య అత్యంత పిరికిచర్యగా పలు దేశాలు అభివర్ణిస్తున్నాయి.