పెళ్లి మ్యాచ్ కి రైనా రెడీ

 

అమ్మాయిలకు షాకింగ్ న్యూస్. ఏంటంటారా... వరల్డ్ కప్ తర్వాత సురేష్ రైనాకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు నిర్ణయించుకున్నారంట. చాలా మంది అమ్మాయిలకి ఇది షాకింగ్ న్యూసేగా మరి. జీవితంలో అతిపెద్ద మ్యాచ్ పెళ్లే అని కామెంట్ విసిరిన రైనా ఇప్పుడు ఆమ్యాచ్ కు రెడీ అవుతున్నాడా అంటే అవుననే సంకేతాలే కనపడుతున్నాయి. తన స్నేహితురాలి కూతురితో అతని వివాహం చేయాలని రైనా తల్లి యోచిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో రైనా పెళ్లి చోసుకోబోతున్నాడు అనే పుకార్లు వచ్చినా... అవన్నీ తూచ్ అని తేలిపోయాయి. అయితే సురేష్ రైనాను ఒక ఇంటి వాడిని చేయాలని కుటుంబసభ్యులు ఈమధ్యే గట్టిగా నిర్ణయించుకోవడంతో త్వరలోనే రైనా మూడు ముళ్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్ లో రైనా సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గతంలో పుకార్లు వచ్చాయి. ఈసా'రైనా' పెళ్లి అవ్వాలని ఆశిద్దాం.