సుప్రీం ఉత్త‌ర్వుల బేఖాత‌రు ప్ర‌మాద‌క‌రం..ఏపీ హైకోర్టు

ఒక కేసులో పోలీసు స్టేష‌న్‌కి, కోర్టుకీ వెళ్లిన వ్య‌క్తి త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని తెలిసి ఎంపీని క‌లిసి కేసు లే కుండా చేసుకుంటాడు. ఎంపీగారు  ఒక్క ఫోన్ కాల్‌తో అంత పెద్ద కేసూ  అమాంతం నీరుగారిపోతుంది. జైలుకి వెళ్ల‌వల‌సిన‌వారు  బ‌య‌ట తిరిగేస్తుంటారు. ఇది సినిమా సీన్‌!  పోతే, ఇటీవ‌లి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలే న్యాయ‌స్థానం ప‌నులు చేసేస్తూ కేసులు మాఫీ చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. త‌మ వారిని కాపాడుకునే ల‌క్ష్యంతో ప్రభుత్వాలు జీవో జారీచేయ‌డం ప‌ట్ల హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

అస‌లు సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌ను బేఖాత‌రు చేస్తూ జీవోల‌ను ఇస్తే ప్ర‌భుత్వానికే ప్ర‌మాద‌మ‌ని కోర్టు వ్యాఖ్యా నించింది. ప్ర‌జాప్ర‌తినిధుల‌పై కేసులు ఉప‌సంహ‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకో రాద‌ని సుప్రీం కోర్టు 2020 సెప్టెంబరు 16న తేల్చిచెప్పిందని గుర్తు చేసింది. ఉప‌సంహ‌రించు కోవ‌డానికి ముందుగా హైకో ర్టు అనుమ‌తించిన త‌ర్వాత‌నే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది.  

హోంశాఖ జారీ చేసిన జీవోలను తాము కొట్టేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే ఓ పరిష్కారంతో కోర్టు ముందుకు రావాలని సూచించింది. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీ ఎస్ ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం  ఆదేశాలిచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంపీ లు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించి సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇవ్వా లని బీజే పీ నాయ కుడు అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యా న్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు అనుమతి లేకుండా ప్రస్తుత, మాజీ ఎంపీ లు, ఎమ్మె ల్యేలపై కేసులు ఉపసంహరించడానికి వీల్లేదంటూ 2020 సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది. 

పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు సిఫార సు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అందులో ప్రస్తావించింది. మరోవైపు జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మె ల్యే సామినేని ఉదయభానుపై మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ ఏపీ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ  వ్యా జ్యాలు బుధవారం విచారణకు వచ్చాయి. చెవుల కృష్ణాంజనేయులు తరఫున న్యాయ వాది వెంకటేష్‌ వాద నలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే ఉదయభానుపై ఉన్న తీవ్రమైన కేసులు ఉపసంహరించేందుకు ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. కేసులు ఉపసంహ రించేందుకు సంబంధిత పీపీలు చర్యలు తీసుకోవాలని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వమే కేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చిందని తెలిపారు. 

హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఉపసంహరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ప్రభుత్వ చర్య సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. హోంశాఖ తరఫున ప్రభు త్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చి నా, ప్రక్రియ తుది దశకు చేరలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చిన తరు వాతే కేసులు ఉపసంహరిస్తామని తెలిపారు. ఆ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశించినా.. హైకోర్టు అనుమతి పొందకుండా  నేరుగా కేసుల ఉపసంహరణకు జీవోలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పరిష్కార మార్గంతో కోర్టు ముందుకు రావాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.