వడదెబ్బ నివారణ కొరకు సులభ యోగాలు..

 

ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత విపరీతముగా ఉన్నది. వడగాలులు కూడా ఎక్కువుగా ఉన్నాయి . ఇటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది.  ఉద్యోగరీత్యా మరియు వ్యక్తిగత పనులనిమిత్తం బయట తిరిగేవారు ఎండ తీవ్రతకు గురి అయ్యి అనారోగ్యానికి గురవ్వడం జరుగును.

 

ఇప్పుడు నేను చెప్పబోయే వడదెబ్బ నివారణా యోగాలు పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు. 

 

*  ఉల్లిపాయ రసమును శరీరానికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును. 

 

 

* వేసవి ఎండలో బయటకి వెళ్లవలసి వచ్చినపుడు తలకు టోపీ ధరించి టోపి లోపల ఉల్లిగడ్డను ఉంచుకొనవలెను. లేదా రుమాలలో ఉల్లిగడ్డని ఉంచి తలకు కట్టుకుని వెళ్లవలెను .

 

*  నీరుల్లిపాయ రసమును రెండు కణతలకు , గుండెలకు పూసిన వడదెబ్బ వలన కలిగిన బాధ తగ్గును. 

 

 

*  వడదెబ్బ తగిలినచో ముఖము పైన , శరీరంపైన నీళ్లు చల్లుచూ తలపై ఐస్ గడ్డలను ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను. 

 

*  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనంతో కలిపి తాగుచున్న వడదెబ్బ తగలదు. 

 

* వడదెబ్బ తగిలిన వ్యక్తికి విశ్రాంతిగా పడుకోబెట్టి కాఫీ తాగుటకు ఇచ్చుచున్న వడదెబ్బ నుంచి తట్టుకొనును. 

 

*  48 గ్రాముల చన్నీరు తీసుకుని ఒక తులం తేనె వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ తగ్గును. 

 

 

* వడగండ్లు పడినపుడు వాటిని సేకరించి విబూదిలో వేసి ఉంచి వడదెబ్బ తగిలినప్పుడు వారికి మూడువేళ్లకు వచ్చినంత తీసుకుని ఒక గ్లాసు మంచినీటితో కలిపి తాగించవలెను . 

 

*  నువ్వులనూనెలో చనుబాలు రంగరించి చెవులలో వేసి గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును. 

 

*  తరవాణి తేటలో ఉప్పు కలిపి ఇవ్వవలెను . 

 

*  తాటిముంజలు పంచదారతో కలిపి ఇవ్వవలెను. 

 

*  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగలో ఉప్పు వేసి అన్నములో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను . 

 

 

*  చన్నీటితో స్నానం చేయవలెను . వేడివేడి పలచని గంజిలో ఉప్పు కలిపి తాగవలెను . 

 

*  నిమ్మ ఉప్పును నోటిలో వేసుకొనిన నాలుకకు ఊట ఊరి వడదెబ్బ నివారణ అగును.

పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.