సునీతా విలియమ్స్ ఐసోలేషన్ లో ఎంత కాలం ఉండాలంటే..?

సునీతా విలియమ్స్ 9 నెలల సుదీర్ఘ కాలం అంతరిక్షంలో చక్కుకుపోయి ఎట్టకేలకు భువికి చేరుకున్నారు. అయితే అంత కాలం అంతరిక్షంలో ఉన్న ఆమె ఇక్కడ భూమి మీద సాధారణ జీవితం గడపడం అంత సులభం కాదు. ఆమె కొంత కాలం ఐసోలేషన్ లో ఉండాల్సిందే.  

 దాదాపు నెలన్నర పాటు సునీతా విలియమ్స్ నాసా కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.  వైద్యులు, మానసిక నిపుణులు ఈ నెలన్నర అంటే 45 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తారు. అలాగే రోజజుకు రెండు గంటల పాటు వివిధ వ్యాయామాలు చేయిస్తారు.  ఎందుకంటే సుదీర్ఘకాలం రోదసిలో ఉండటం వల్ల సునీతా విలియమ్స్ పలు శారీరిక మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీరో గ్రావిటీ  వాతావరణంలో గడపడం వల్ల భూమి మీద ఆమె మళ్లీ మామూలు జీవితం గడపడానికి కొంత కాలం పడుతుంది.  నడవడం, దృష్టిని స్థిరంగా ఉంచడంలో సునీతా విలియమ్స్ ఇబ్బందులు పడుతున్నారు.

ఆమెను క్యాప్సుల్ నుంచి స్ట్రెచ్చర్ పై తీసుకురావడాన్ని ప్రపంచమంతా దృశ్యమాధ్యమాల ద్వారా తిలకించింది. ఇదే కాకుండా శరీరంలో రేడియేషన్ స్థాయి ఎక్కువగా ఉండటం, అలాగే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు కూడా సునీతా విలియమ్స్ ఎదుర్కొంటున్నారు. గతంలో అంటే 1984లో భారత సంతతికి చెందిన రాకేష్ వర్మ రోదసిపై కాలు మోపిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ లో గడపాల్సి వచ్చింది. రోదశిలోకి వెళ్లిన ప్రతి వారూ ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అప్పట్లో రాకేష్ శర్మ రోదశిలో ఏడు రోజుల 21 గంటల 40 నిముషాల సేపు గడిపారు. ఆ కారణంగా ఆయన నెలల తరబడి ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది.

అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్ లు 9 నెలల పాటు రోదశిలో చిక్కుకుపోయారు. దీంతో వీరు ఎక్కువ రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోంది.  నాసా కేంద్రంలో వీరికి 45 రోజుల పాటు మూడు దశలలో శిక్షణ ఇచ్చి భూమి వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. మొదటి దశలో కండరాల బలోపేతానికి సంబంధించి శరీర శక్తి, రక్త ప్రసరణ పెరిగేందుకు అవసరమైన చికిత్స, వ్యాయామాలు చేయిస్తారు. ఇక చివరిదైన మూడో దశలో  వారిలో చురుకుదనం పెంచేందుకు అవసరమైన వ్యాయామాలతో పాటు, భూవాతావరణానికి అనుగుణంగా శరీకం అలవాటుపడేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు.  ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 45 రోజులు పడుతుందని నాసా  వర్గాలు తెలిపాయి. ఆ కారణంగానే అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వెంటనే సునీతా విలియమ్స్ ను వైట్ హౌస్ కు ఆహ్వానింలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకున్న తరువాత వైట్ హౌస్ కు ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతానని ఆయన అన్నారు.