జులై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.129.03 కోట్లు
posted on Aug 2, 2023 10:17AM
తిరుమల శ్రీవారిని జులై నెలలో 23.23లక్షల మంది దర్శించుకున్నారు. ఆ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 129.03 కోట్ల రూపాయలు వచ్చింది. జూలైలో అత్యధికంగా 9వ తేదీన 88 వేల 836 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
అలాగే 17వ తేదీన శ్రీవారి హుండీ ఆదాయం అత్యధికంగా 5.40 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక నెల చివరి రోజు 31వ తేదీన శ్రీవారి హుండీ ఆదాయం 5.21 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం అంటే ఆగస్టు 1న శ్రీవారిని 67 వేల 728 మంది దర్శించుకున్నారు.
21, 084 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చింది. మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.