7 కోట్ల ఖ‌రీదైన వైన్ బాటిల్‌.. అంత ధ‌ర ఎందుకంటే...

వైన్ అంటేనే సంథింగ్ స్పెష‌ల్‌. బ్రాంది, విస్కీల‌కంటే డిఫ‌రెంట్‌. విదేశాల్లో వైన్‌కు ఫుల్ క్రేజ్‌. ఇక ఫ్రెంచ్ వైన్ అన్నిటికంటే బెస్ట్‌. ఎంత పాత వైన్ అయితే అంత టేస్ట్‌. వైన్‌ ఎంత‌గా మాల్ట్ అయితే అంత కాస్ట్‌. వైన్‌కు ప్ర‌త్యేక రుచి తీసుకొచ్చేందుకు.. భూగ‌ర్భంలో నేల‌మాలిగ‌ల్లో వైన్‌ను ఏళ్ల త‌ర‌బ‌డి పులియ‌బెడ‌తారు. బాగా పులిశాక‌.. అంద‌మైన బాటిల్స్‌లో అమ్ముతుంటారు. అంత క‌ష్టం, అంత రుచి, అంత ప్ర‌త్యేక వాస‌న ఉంటుంది కాబ‌ట్టి.. ధ‌ర కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఒక్కో బాటిల్ ల‌క్ష‌ల్లో ధ‌ర ప‌లుకుతుంది. కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే వైన్ బాటిల్ వీట‌న్నిటికంటే చాలా చాలా స్పెష‌ల్‌. అందుకే ఆ బాటిల్‌కు ఏకంగా 7 కోట్ల‌కు పైగా చెల్లించేందుకు వైన్ ల‌వ‌ర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇంత‌కీ, ఆ వైన్ స్పెషాలిటీ ఏంటంటే...

అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్‌. అందుకే దాని ధర కూడా ఆకాశ‌మంత ఎత్తులో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ISSలో ఏడాదికిపైగా ఆ వైన్‌ను మాల్ట్ చేశారు. ఆ ఫ్రెంచ్ వైన్‌ బాటిల్‌ను ఇప్పుడు క్రిస్టీస్‌ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు 7.37 కోట్లు) పలకొచ్చని భావిస్తోంది. 

2019 నవంబరులో అంతరిక్షంలోకి 12 వైన్‌ సీసాల‌ను పంపించారు. అందులోని ఒక బాటిల్‌నే ఇప్పుడు వేలం వేస్తున్నారు. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ ‘స్పేస్‌ కార్గో అన్‌లిమిటెడ్‌’ వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత ఆ బాటిల్స్‌ను తిరిగి భూమికి తీసుకొచ్చారు. వీటికి ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వైన్‌ అండ్‌ వైన్‌ రీసెర్చ్‌లో పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూశారు. రుచిలో రెండింటి మధ్య చాలా తేడా ఉందని చెప్పారు. అంత‌రిక్షంలో మాల్ట్ చేసిన వైన్‌.. స్మూత్‌గా, సువాసన భరితంగా ఉందని తేల్చారు. గురుత్వాకర్షణ లేని చోట ప్రత్యేక వాతావరణంలో ఈ వైన్‌ ‘పరిపక్వానికి’ వచ్చింది కాబ‌ట్టి ఆ వైన్ టేస్ట్ అదుర్స్ అంటున్నారు. అందుకే, ఆ వైన్ బాటిల్‌ వేలంలో  7 కోట్ల‌కు పైగా ధ‌ర ప‌ల‌కొచ్చ‌ని చెబుతున్నారు. ఆ వైన్ బాటిల్‌కు ఓ పేరు కూడా ఉంది. ‘పెట్రస్‌ 2000’. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu