Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టేసిన కొత్త కెప్టెన్ శుభమన్ గిల్
posted on: Jul 12, 2025 3:29PM

భారత జట్టు నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టి మరీ ఈ రికార్డును సాధించాడు. భారత టెస్ట్ జట్టు నూతన సారథి శుబ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బ్యాట్‌కు ఒక రేంజ్లో పనిచెప్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో గిల్ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో పలు పాత రికార్డులకు బ్రేక్ చేస్తూ ఫోకస్ అవుతున్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో మరో క్రేజీ రికార్డు సృష్టించాడు శుబ్‌మన్. ఏకంగా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును అతడు అధిగమించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులలో కలిపి ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 585 పరుగులు చేసిన గిల్.. లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 16 పరుగులు చేశాడు. దీంతో ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ 601 పరుగులకు చేశాడు. తద్వారా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు.
ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు బాదిన వారి లిస్ట్‌లో లెజెండ్ రాహుల్ ద్రవిడ్ (4 ఇన్నింగ్స్‌ల్లో 602 పరుగులు) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో గిల్ (601) నిలిచాడు. శుబ్‌మన్ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ (593), సునీల్ గవాస్కర్ (542) ఉన్నారు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (5 మ్యాచుల్లో 712 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచులు ఉన్నందున జైస్వాల్‌ను గిల్ అలవోకగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన గిల్.. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విఫలమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు గిల్. స్పీడ్‌స్టర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే గిల్ ఔట్ అయినా ఒక ఎండ్‌లో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (53 నాటౌట్), మరో ఎండ్‌లో పించ్ హిట్టర్ రిషబ్ పంత్ (19 నాటౌట్) గట్టిగా నిలబడ్డారు. రెండో రోజు ఆటను విజయవంతంగా ముగించారు.






