మునుగోడు లో టిఆర్ఎస్ కు  షాక్‌.. మాజీ ఎంపీ బూర గుడ్ బై

పార్టీ అధినేత పార్టీ నేత‌ల‌కు అందుబాటులో ఉండాలి. వారి మాటా వినాలి. స‌ల‌హాలు విన‌క‌పోయినా ప‌ర వాలేదు. కానీ వారి అభిప్రాయాల‌కీ గౌర‌వం ఇవ్వాలి. కానీ వీటికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్ త‌న పార్టీ నుంచి మాజీ ఎం.పి బూర న‌ర్స‌య్య‌గౌడ్ వెళిపోవ‌డానికి కార‌కుల‌య్యారు. ఇటీవ‌లి కాలంలో కేసీఆర్  దేశ రాజ‌కీ యాల‌మీద ఆస‌క్తి చూప‌డం, పార్టీని ఆ విధంగా బ‌లోపేతం చేయ‌డం అస‌లు పార్టీ పేరునే మార్చి కేంద్రం లో బీజేపీకి ట‌గ్గ‌ఫ‌ర్‌గా నిలిచి  అక్క‌డి రాజ‌కీయాల్లో హ‌ల్‌చ‌ల్ చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌ట‌మే ఇక్క‌డ పార్టీ ప‌రిస్థితులప‌ట్ల అనాస‌క్తి పెంచింద‌నాలి. ఉద్య‌మ‌యోధునిగా, తెలంగాణా ఆవిర్భావానికి కార‌కునిగా, తొలి ముఖ్యమంత్రిగా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందిన కేసీఆర్ క్ర‌మేపీ ప్ర‌జ‌ల‌కంటే త‌న పార్టీ వారికే బాగా దూర‌మ య్యారన్న‌ది తెలుస్తోంది. 

త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు, బీజేపీని దెబ్బ‌తీయ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యంగా పావులు క‌ద‌ప‌డంలో పార్టీ మునుగోడు విజ‌యానికి ప‌టిష్టం చేయ‌డంపై ఆస‌క్తి చూపుతున్నారా అన్న ప్ర‌శ్న‌త‌లెత్త‌డానికి కేసీఆర్  స్వ‌యంగా కార‌కుల‌య్యారు. అభ్య‌ర్ధిని నిల‌బెట్టాలి గ‌నుక ఒక‌రిని ప్ర‌క‌టించ‌డం త‌ప్ప విజ‌యావ‌కాశాలు ఏ మేర‌కు ఉన్నాయ‌న్న లెక్క ప‌రిశీలించ‌డం లేదు. కార‌ణం ఆయ‌న కుటుంబం స‌మ‌స్య‌ల వ‌లయంలో చిక్కు కుంది. మ‌రీ ముఖ్యంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఆయ‌న కుమార్తె టిఆర్ ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు బ‌య‌టికి రావ‌డంతో ఆ మ‌చ్చ‌ను తొల‌గించుకునే ప‌నిలోప‌డ్డారు. రోజూ కేంద్రాన్ని, మోడీని, షానీ తిట్టు కోందే రోజు గ‌డ‌వ‌ని కేసీఆర్, ఇపుడు త‌న ప‌రువు కాపాడుకునేందుకు ఢిల్లీలోనే మ‌కాం పెట్టి ఢిల్లీ పెద్ద‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని చూస్తున్నారు. అయితే తిట్టిన నోటితోనే అన్నా నా కూతురుని నీవే కాపాడాలి, మా పాలిగ వెంక‌న్న‌వి, యాద‌గిరి న‌ర్సింహుడివీ అంటే ఎంత కాషాయంలో ఉన్న‌ప్ప‌టికీ మోదీ వింటారా? ప‌గ‌దీర్చుకోవ‌డానికి కేసీఆర్ స్వ‌యంగా దొరికిపోయారు. బుర‌ద‌ప‌డిన పార్టీలో ఎవ‌రు మాత్రం ఆస‌క్తితో, ఇష్టంతో ఉంటారు. ఎవ‌రి కెరీర్‌వారిది. ఎవ‌రి ఇష్టాయిష్టాలు వారివి. బూర వి అందుకు మిన‌హాయింపు కాదు. అందుక‌నే ఒక‌నాటి కేసీఆర్‌కి ఇప్ప‌టి రాటుదేలిన రాజ‌కీయ‌చ‌ద‌రంగం తెలిసిన కేసీఆర్‌కి ఎంతో వ్య‌త్యాసం గుర్తించి బూర న‌ర్సింగ్ గౌడ్ వంటి సీనియ‌ర్లు పార్టీ మార‌డానికి నిర్ణ‌యించు కున్నారు. పైగా  త‌న మాట‌ను, పిలుపుని ప‌ట్టించుకోని నాయ‌కుని ద‌గ్గ‌ర ఉండి అవ‌మానప‌డే కంటే వేరు పార్టీ పంచ‌న చేరి కాస్తంత గౌర‌వం ద‌క్కించుకోవ‌డానికి నిర్ణ‌యించుకున్నార‌నే అనుకోవాలి. ఇదేమంతగా కేసీఆర్‌కు న‌ష్టం క‌లిగించ‌క‌పోవచ్చు. కానీ హితుల‌ను దూరం చేసుకోవ‌డం భ‌విష్య‌త్తులో టీఆర్ ఎస్‌కు ఎంతో వ్య‌తిరేక ప్ర‌భా వ‌మే చూపుతుంది. 

ఏ రోజు పదవి కోసం పాకులాడలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఆకాంక్ష కొరకు మాత్రమే పోరాటం చేసినట్లు బూర చెప్పారు. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా అంత బాధ పడలేదన్నారు. బీసీ వర్గాల సమస్యలను కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేదన్నారు. ఏ పార్టీ అయినా ప్రజల సమస్యలు పరిష్కరిస్తే వారితో ఉంటానని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu