రచయిత షిర్లె చెంగ్

 

Shirley Cheng Author, Shirley Cheng news,  Author Shirley Cheng

 

 

" షిర్లె చెంగ్" పుట్టిన 11 నెలలకి ఓ అరుదైన వ్యాధితో శరీర బాగాల కదలిక కోల్పోయింది ఊహ తెల్సిన నాటినుంచి వీల్ ఛైరే తనకి తోడు - అలా వీల్ ఛైర్ సాయంతో 11 ఏళ్ళ వయసులో స్కూలు లోకి అడుగుపెట్టింది చదువే వ్యాపకం- తన భావాలని అక్షరీకరించడం మొదలు పెట్టింది - అవి అద్భుతమైన కవితలుగా మారాయి ప్రచురితమైన ప్రతి కవిత ఆమెకి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాని తన 14 ఏళ్ళ వయసులో కంటి చూపును కూడా కోల్పోయింది అయిన ధైర్యం కోల్పోలేదు. " చెంగ్ "

 

"వాకింగ్ స్పిరిట్ " పేరుతో షిర్లె చెంగ్ రాసిన పుస్తకం అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయి ఏడు అవార్డులు గెలుచుకుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు 30 కి పైగా పుస్తకాలు రాసింది ఇరువై ఒక్క అవార్డులు సంపాదించింది. చెంగ్ ప్రసంగిస్తే నరనరాలు స్పూర్తితో నిండిపోతాయి, శరీరం సహరించకపోయిన రేడియో షోలు  నిర్వహించడం  రచనలు చేయడం ఇలా ఎన్నో  చిన్న వయస్సులోనే అంతర్జాతీయంగా పొందింది " షిర్లె చెంగ్ "  


......రమ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu