శత్రుఘ్నసిన్హాపై పార్టీ నేతలు ఫైర్..

 

బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హాపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ మధ్య అవినీతి ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికి శత్రుఘ్నసిన్హా మద్దతుగా మాట్లాడారు. దీంతో ఆయనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ మాట్లాడుతూ...శత్రుఘ్నసిన్హా విశ్వాసఘాతకుడని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని..బీజేపీకి శత్రువుగా మారిన శత్రుఘ్నసిన్హా మాత్రం లాలూను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో తిరుగుబాటు నేతగా శత్రుఘ్నసిన్హా వ్యవహరిస్తున్నారని సుశీల్‌ మోదీ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu