నవ రత్నాలు సరే... నవ సందేహాలు తీర్చు జగనన్నా

వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది. దీంతో  కాంగ్రెస్  అధిష్టాాాానం అదే వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిలను రంగంలో దింపింది.  ఆమె ప్రస్తుతం  ఎపి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి దూసుకెళుతున్నారు. స్వంత అన్నను ఓడించడానికి ఆమె ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. జగన్ అమలు చేసే నవరత్నాల స్కీంకు కౌంటర్ గా  నవ సందేహాలతో చెల్లెలు షర్మిల ప్రజల్లో చొచ్చుకెళుతున్నారు. 
తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 
ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఎందుకు నిరాకరించారు? స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారు? డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? అంటూ తన లేఖలో షర్మిల తొమ్మిది ప్రశ్నలను సంధించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ నవరత్నాల గురించి గర్వంగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కు షర్మిల నవ సందేహాలను సంధించారు.