క్రికెట్‌లో కొత్త రూల్ పెట్టాలన్న సచిన్

క్రికెట్ లో కొత్త రూల్ పెట్టాలంటున్నారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. బ్యాట్స్ మెన్ కచ్చితంగా హెల్మెట్ పెట్టుకొనేలా రూల్ అమలు చేయాలని సూచించారు. ఫాస్ట్ బౌలర్ ను ఎదుర్కొనేటప్పుడైనా లేదా స్పిన్నర్ ను ఎదుర్కొనే సమయంలోనైనా బ్యాట్స్ మెన్లు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను తీసుకురావాలని మాస్టర్ చెబుతున్నారు. ప్రొఫెనల్ స్థాయిలో ఆడే ప్రతి ఆటగాడు ఈ నిబంధనను పాటించాలని చెప్పాడు. 

 

ఇటీవల క్రికెడ్ ఆడుతూ ప్లేయర్లు గాయపడుతున్నారు. బ్యాట్స్ మెన్ ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా ఆడుతుండటం వల్లే బౌన్సర్లు తలకు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతన్నాయి. ఈ నేపథ్యంలోనూ కొత్త రూల్ పెట్టాలని సూచిస్తున్నారు సచిన్ టెండుల్కర్. బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ చేసేటప్పుడు వారికి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. బౌలర్లు విసిరే బంతులు బౌన్స్ అయి వారి ముఖాలను తీవ్రంగా గాయపరుస్తుంటాయి. స్పిన్నర్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా గాయపడిన బ్యాట్స్ మెన్లు ఉన్నారు. అందుకే ఈ రూల్ కంపల్సరి చేయాలని చెబుతున్నారు. 

 

క్రికెట్లో ఇప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు కేవలం టెస్ట్ క్రికెట్ మాత్రమే ఉండగా... ఆ తర్వాత వన్డేలు, టీ20లు వచ్చాయి. ఇప్పుడు 10 ఓవర్ల లీగులకు కూడా సన్నాహకాలు చేస్తున్నారు. ఆట నిబంధనల్లో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరో కొత్త రూల్ పెడితే మంచిదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించారు. మాస్టర్ సూచనకు ప్లేయర్ల నుంచి మద్దతు వస్తోంది. ఆటగాళ్ల రక్షణ కోసం హెల్మెట్ కంపల్సరి చేయాలని పాతతరం ఆటగాళ్లు, కోచ్ లు కూడా సూచిస్తున్నారు.