రష్యా విమానం.. జ్యూస్ టిన్‌లో బాంబు పెట్టి పేల్చేశాం.. ఐసిస్
posted on Nov 19, 2015 2:10PM
ఇటీవల ఈజిప్ట్ లో రష్యా విమానం కూలిపోయి అనేక మంది ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే. ఈజిప్ట్ లోని సినాయ్ పర్వత ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందని అప్పుడు అధికారులు తెలిపినా దానికి కారణం ఉగ్రవాదులే అని అనుమానం వ్యక్తమయింది. ఆతరువాత ఉగ్రవాదులే విమానాన్ని పేల్చేసినట్టు చెప్పారు.. కానీ మొదట ఆ ప్రకటనను ఎవరూ నమ్మకపోయినా ఆఖరికి అది నిజమే అని తేలింది. అయితే ఇప్పుడు అసలు విమానాన్ని ఎలా పేల్చారు అన్నదానిపై వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా విమానాన్నితాగిపారేసిన పైనాపిల్ జ్యూస్ టిన్‌లో డిటోనేటర్‌ను అమర్చి పేల్చివేసినట్టు తెలిపారు. ఈ బాంబు విమానంలోకి తీసుకెళ్లడంలో మా అనుచరులు పోలీసులను బురిడి కొట్టించారని అన్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన బాంబు ఫొటోను.. బాంబును విమానంలోకి చేర్చిన ప్రయాణికుల పాస్ పోర్టు ఫోటోలను కూడా తమ అధికార మ్యాగజైన్ ఢబిక్ లో ప్రచురించారు. తమపై బాంబుల వర్షం కురిపించే దేశాలకు ఇది ఓ హెచ్చరిక అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.