45పైసలతోనే రూ.10లక్షల ఇన్సూరెన్స్

రైలు ఎక్కాల్సిన  ప్రయాణికుడు.. రైల్వేస్టేషన్‌కు వచ్చి.. తాను ఎక్కాల్సిన  రైలు ఏ ప్లాట్ ఫామ్ మీదకు వస్తుందోనని అక్కడ ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డ్ వైపు చూడడం.. లేకుంటే.. లేడి అనౌన్సర్ చెప్పే.. ప్రయాణికులకు ముఖ్య గమనిక ఫలాన రైలు.. ఈ నెంబర్ ఫ్లాట్‌ఫామ్ మీదకు వస్తుందంటూ ప్రకటిస్తోంది. దీంతో రైలు ఎక్కాల్సిన ప్రయాణికుడు.. సదరు డిస్ ప్లే బోర్డు వైపు చూడడం లేదా అనౌన్సర్ చెప్పే ప్రకటనపై దృష్టి సారించడం చేస్తారు. అయితే తాను ప్రయాణిస్తున్న రైలు.. ఎక్కడైనా ప్రమాదం జరిగి.. తమ ప్రాణాలను ముప్పు ఏర్పడితే.. తమపైన ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటనే ఓ ప్రశ్న అయితే సగటు ప్రయాణికుడు వేసుకోవడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒడిశాలో చోటు చేసుకొన్న రైలు ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డగా.. దాదాపు తొమ్మిది వందల మంది తీవ్ర గాయాలపాలైయ్యారు.

అయితే వీరెవ్వరూ.. తమ రైలు ప్రయాణంలో ఇన్యూరెన్స్ చేయకపోవడం గమనార్హం. అలాంటి వేళ.. ప్రతీ రైల్వే ప్రయాణికుడు మదిలో ప్రస్తుతం ఇన్యూరెన్స్‌ అంశం మెదులుతున్నట్లు  తెలుస్తోంది.   

అసలు రైల్వే ప్రయాణికులకు.. ఇన్స్‌రెన్స్ ఉంటుందా? ఉంటే ఎక్కడ.. ఎలా చెల్లించాలి.. తదితర అంశాలపై రైల్వే ప్రయాణికులు ప్రస్తుతం దృష్టి సారించినట్లు సమాచారం. ఆ క్రమంలో కేవలం 45 ఫైసలు చెల్లిస్తే.. 10 లక్షల రూపాయిల వరకు బీమా కింద వస్తుందని తెలుసుకొని.. రైలు ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు గురివుతున్నారు.  

రైల్వే టికెట్ కోసం ఆన్‌లైన్లో బుక్ చేసుకొనే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని టిక్ చేయండి.. దీని వల్ల కేవలం 45 పైసలకే 10 లక్షల రూపాయిల బీమా కవరేజ్ అందుతుంది. రైలు ప్రయాణ సమయంలో దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ బీమా నగదు మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. 

అయితే ఆన్‌లైన్లో రైలు టికెట్లను బుక్ చేసుకొనే క్రమంలో.. బర్త్‌లు ఖాళీ ఉన్నాయా? లేదా? ఓ వేళ వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఎంత ఉంది? కన్‌ఫార్మ్ అవుతుందా ? కాదా? అనే అంశాలపైనే ప్రతీ ప్రయాణికుడు దృష్టి పెడుతున్నారు తప్పా.. ఇన్యూరెన్స్ చేసుకొనే విషయాన్ని దాదాపుగా ప్రయాణికులంతా వదిలేస్తున్నారని విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలా చేయించుకొన్న బీమా కవరేజ్.. ప్రమాదంలో మరణించినప్పుడే కాదు.. గాయపడినప్పుడు సైతం బీమా కవరేజ్ అందుతుందన్నది సుస్పష్టం.   

మరోవైపు రైలు ప్రయాణం కోసం ఆన్‌లైన్లో టిక్కెట్ బుక్ చేస్తున్నప్పుడు.. IRCTC వెబ్ సైట్ లేదా యాప్ లోనో ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఆ లింక్ను బీమా సంస్థ పంపుతుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే బీమా క్లెయిమ్ పొందడం చాలా సులభమవుతోంది. నామిని పేరు పెట్టడం... వల్ల సులభంగా నగదు ..కుటుంబానికి అందుతొంది. ఈ నేపథ్యంలో నామినీ పేరు తప్పని సరిగా పూరించాల్సి ఉంటుంది.

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉన్న సందర్భంలో... రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకుడికి ఏదైనా ప్రమాదం జరిగితే, జరిగిన నష్టాన్ని బట్టి బీమా మొత్తం అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే అతని కుటుంబానికి 10 లక్షల రూపాయిలు అందుతుంది. అలాగే ప్రమాదంలో రైల్వే ప్రయాణికుడు పూర్తి స్థాయి అంగ వైకల్యం పొందితే బీమా కంపెనీ అతనికి 10 లక్షల రూపాయలను బీమా కింద అందిస్తోంది. ఓ వేళ ప్రమాదంతో ప్రయాణికుడు పాక్షిక అంగవైకల్యం పొందితే.. అతడికి 7.5 లక్షల రూపాయిల నగదు.. అలాగే కేవలం గాయాలు మాత్రమే అయితే అతడికి 2 లక్షల రూపాయిలను ఆసుపత్రి ఖర్చులు కింద చెల్లిస్తుంది.

ఈ నగదును రైలు ప్రమాదం జరిగిన 4 నెలల లోపు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి..  వాళ్లు అడిగిన వివరాలతోపాటు పత్రాలను  సైతం సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు. భారతీయ రైల్వే ఈ బీమా సౌకర్యాన్ని గతంలోనే ప్రవేశపట్టిన.. ప్రయాణికులెవ్వరూ.. పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తులు.. క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారన్న నమ్మకం అయితే లేని రోజులు వచ్చేశాయి. అలాంటి పరిస్థితుల్లో.. రైలు ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరు.. ఇకపై  ఇన్యూరెన్స్ చేయించుకోనేందుకు కొద్దిపాటి శ్రద్ద చూపిస్తే... అదే మీ కుటుంబానికి శ్రీరామ రక్ష అవుతొందనడంలో ఎటువంటి సందేహం అయితే లేదన్నది మాత్రం వాస్తవం.