జగన్ ను అన్ ఫాలో చేసిన రోజా?.. సందేహం లేదు.. ఇక సాంబారే!

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పేశారా? ఇక దేవుడిచ్చిన జగనన్న ముఖం కూడా చూడకూడదని నిర్ణయించేసుకున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీనీ, జగన్ ను అన్ ఫాలో అయ్యారు. అలా వైసీపీని అన్ ఫాలో చేయడం ద్వారా ఇక తనకు ఆ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పేశారు.

ఆమె హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో గత కొంత కాలంగా ఆమె తమిళనాడు నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ఫ్రెష్ గా మెదలు పెట్టనున్నారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చారని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇక రోజాకు ఏపీతో, వైసీపీతో బంధం తెగిపోయి నట్లేనని చెబుతున్నారు. వాస్తవానికి ఒక్క రోజా అనే కాదు ఇటీవలి ఘోర పరాజయం తరువాత పలు వురు వైసీపీ సీనియర్లు పార్టీకి దూరం అయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం, స్థాయి కూడా చూసుకోకుండా ఇష్టారాజ్యంగా  తెలుగుదేశంపైనా, ఆ పార్టీ అగ్రనాయకుల మీదా నోరెట్టుకు పడిపోయిన వాళ్లంతా ఇప్పుడు నోరుకుట్టుకుని మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. విడదల రజని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశి, గుడివాడ అమర్నాథ్ ఇలా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం స్థాయి మరిచి చెలరేగిన నేతలెవరూ ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.

ఆ కోవలోనే రోజా కూడా నడుస్తున్నారు. సినీ నటిగా ఆమెకు తమిళనాట ఉన్న క్రేజ్, గుర్తింపునకు తోడు దర్శకుడిగా రోజా భర్త సెల్వమణికి కూడా ఆ రాష్ట్రంలో ఒకింత పలుకుబడి ఉండటంతో రోజా సేఫ్ సైడ్ గా తమిళనాడుకు మకాం మార్చేశారని వైసీపీ వర్గాలే బెబుతున్నాయి. ఇప్పుడామె తమిళనాడు వేదికగా పోలిటిక్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తమౌతున్నారని అంటున్నారు.