సరిపోయింది ఇద్దరికీ..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు జగన్ పార్టీలోని కీలక నేతలు శాయశక్తుల ఉపయోగించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా వైరల్ అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి ఆర్కే రోజా.. మీడియా ముందు మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతమవడమే కాకుండా.. టీడీపీ నేతలపై తనదైన శైలిలో ఓ రేంజ్‌లో విరుచుకు పడిపోయారు. 

అయితే బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన దాదాపు వారం రోజుల తర్వాత.. మంత్రి ఆర్కే రోజా మీడియా ముందు ప్రత్యక్షమై.. కన్నీటి పర్యంతమవుతూ.. టీడీపీ నేతలను టార్గెట్ చేయడంపై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా.. క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా.. చేస్తున్నా.. ఆ వెంటనే రంగంలోకి దిగిపోయి.. వాటిజ్ దీస్.. ఇవేం మాటలు.. సీడీలు ఎక్కడా?.. బయటకు తీయండి?.. వాటిని తీసుకు రండి.. మీ దగ్గర ఉందా? ఆ సీడీలు తీసుకు వచ్చే దమ్ము  ధైర్యమంటూ మీడియా ముందు నానా యాగీ చేస్తే.. నా సామిరంగా సీడీ సంగతి దేవుడెరుగు.. ఎగస్ పార్టీలో సౌండ్ కూడా వస్తుందో రాదో తెలిసిపోయేదని... కానీ దొంగలు పడ్డా ఆరు నెలలకు కుక్కలు మోరిగినట్లుగా.. వారం రోజుల తర్వాత.. ఆర్కే రోజా మీడియా ముందుకు వచ్చి.. కన్నీరు మున్నీరు కావడం ఏం బాగోలేదని ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. టీడీపీ నేత బండారు వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత వారం రోజులకు రోజా స్పందించిన తీరు చూస్తుంటే.. ఫ్యాన్ పార్టీలోని పెద్దలు రంగంలోకి దిగి చక్రం తిప్పుతున్నట్లుగా ఉందనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయనే ఓ చర్చ సైతం ఊపందుకొంది. 

ఇక గతంలో అంటే.. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఫ్యాన్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కోడి కత్తితో దాడి చేయడం.. ఆ వెంటనే అక్కడే ఉన్న వారు... ఆయనకు ప్రాథమిక చికిత్స కోసం.. విశాఖపట్నంలోని స్థానిక ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించడం.. అయితే అందుకు ఆయన ససేమిరా అనడమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు వ్యవస్థ పట్ల తనకు నమ్మకం లేదంటూ.. విశాఖపట్నం నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానంలో వెళ్లిపోయి.. ఆ వెంటనే బంజారాహిల్స్‌లోని ఓ న్యూరో సెంటర్‌లో చేరిపోయి.. అక్కడ చికిత్స చేయించుకోవడమే కాకుండా.. రెండు రోజుల పాటు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కి విశ్రాంతి అవసరమంటూ సదరు ఆసుపత్రి వైద్యులు ప్రకటించడం కోసమెరుపు. అలా చేతికి గాయమై.. స్ట్రేచర్ మీద పొడుకున్న వైయస్ జగన్ చిత్ర రాజులు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేయడమే కాదు.. ఆ తర్వాత ఇదే విషయాన్ని.. అంటే విశాఖ ఎయిర్ పోర్ట్‌ సాక్షిగా తనపై హత్యయత్నం జరిగిందంటూ.. పులివెందుల్లో తన సొంత చిన్నాన్న వైయస్ వివేకా దారుణ హత్యకు గురైన సమయంలో ఆయన మృతదేహాన్ని సందర్శించిన తర్వాత చెప్పారని.. దీంతో ఇదంతా చూస్తుంటే.. ఫ్యాన్ పార్టీలోని అగ్రనేతలు తెర వెనుకు ఉండి నడిపిస్తున్న ఓ ప్రాయోజిత కార్యక్రమంలాగా నేడు ఆర్కే రోజా వ్యవహారం.. నాడు ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ వ్యవహరం ఉందనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. అయినా ఎన్నికలు సమీపించాయనగానే.. ఐ ప్యాక్ చెప్పినట్లు.. ఏ మాత్రం అక్షరం పొల్లు పోకుండా తూ.చా తప్పకుండా చేసుకుపోవడం జగన్ అండ్ కో విధానమని.. అలాంటి వేళ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు మరెన్ని చూడాల్సి వస్తుందోననే ఓ అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. 

అదీకాక.. ఆర్కే రోజాను టీడీపీ నాయకుడు ఇన్ని మాటలు అన్నప్పుడు.. జగన్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ నేతలను, రాజకీయాలతో సంబంధం లేని వారి ఫ్యామిలీలోని వ్యక్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు.. జగన్ ప్రభుత్వంలోని మహిళ ప్రజాప్రతినిధులు కనీసం.. ఇలా మాట్లాడడం తప్పు అని నాడే వారి వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించి ఉంటే.. నేడు మీ పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదనే ఓ అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. 

ఇక ఆర్కే రోజా కన్నీటి పర్యంతమవుతూ.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో చూపించారు కానీ.. అదే జగన్ పార్టీలోని తొలి కేబినెట్‌లోని మంత్రులు, జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు..  మహిళల పట్ల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చూపిస్తే.. పరిస్థితి మరోలా ఉండేదనే ఓ అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. అయినా పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్‌కి మంత్రి ఆర్కే రోజా ఇద్దరు ఇద్దరేనని.. ఎందుకంటే.. ఆయన కోడికత్తి దాడి జరిగిన తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్ ప్రయాణించి.. విశ్రాంతి తీసుకున్నారని.. అలాగే ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆరోపణలు గుప్పిస్తే.. వారం రోజుల తర్వాత స్పందించడం చూస్తే.. వీరిద్దరికీ సరిపోయిందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu