ఆర్జేడీ, బీజేపీ మాట‌ల యుద్ధం..గోడ మీద‌ పిడ‌క‌!

మీ గోడ‌మీద వేసిన పిడ‌కే పెద్ద‌దంటే..ఎదురింటి పిన్నిగారు కాదండీ మీ గోడ‌మీద‌దే మ‌రీ పెద్ద‌గా ఉంద న్నది. పిడ‌క ఎవ‌రు వేసేర‌న్న‌ది కాకుండా ఏ సైజులో ఉంద‌న్న‌దే వారి వివాదానికి కార‌ణం కావ‌డ‌మే విచి త్రం. అదుగో అలా ఉంది బీజేపీ, ఆర్జీడీ మధ్య మాట‌ల యుద్ధం. 

దేశంలో ఇపుడు పిఎఫ్ఐ గురించి ఆరాతీయ‌డంలో ఆరెస్టులు జ‌రుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో నూ ఆ సంస్థ‌కు సైనికుల్లాంటి కుర్రాళ్లుండ‌డ‌మే ప్ర‌భుత్వాల్ని కంగారు పెడుతోంది. బీహార్ మాజీ ముఖ్య మంత్రి లాలూ ప్ర‌సాద్ తాను పిఎఫ్ ఐ స‌భ్యు డ‌న‌ని అంటే తాను ఖ‌చ్చితంగా ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌న‌ని గ‌ర్వంగా  చెప్పుకుంటాన‌ని బిజేపీ నేత గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇలాంటి స‌వాలే మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోం మంత్రి  న‌రోత్తంసింగ్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్‌పై విసిరారు.

దేశంలో పిఎఫ్ ఐని నిషేధానికి ముందే ఆర్ ఎస్ఎస్‌ను నిషేధించాల్సింది అని బీజేపీపై లాలూ యాద‌వ్ విమ‌ర్శ‌నాస్త్రం సంధించారు. అందుకు స్పందిస్తూ  బిజేపీ నేత గిరిరాజ్‌, బీహార్‌లో త‌మ ప్ర‌భుత్వ‌మే ఉం దని, వారికి ధైర్యం ద‌మ్ము ఉంటే బీహార్‌లో ఆర్ఎస్ఎస్‌ను నిషేధించ‌మ‌ని స‌వాలు విసిరారు. ఇటీవ‌ ల కేంద్రం పిఎఫ్ ఐతో పాటు దానికి సంబంధించిన సంస్థ‌ల‌ను తీవ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతు న్నాయ‌న్న నెపంమీద నిషేధించారు. కానీ హిందూ మ‌తోన్మాదంతో రెచ్చి పోతున్న ఆర్ ఎస్ ఎస్ నే ముందుగా దేశంలో నిషేధిస్తే ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉంటార‌ని ఆర్జేడీ అధినేత లాలూ ఢిల్లీకి వినిపించేలా అన‌డం బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.  

కాగా, పిఎఫ్ ఐ నిషేధం పేరుతో ముస్లిం యువ‌త‌పై దాడులు స‌బ‌బు కాద‌ని ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే అలాగ‌ని పిఎఫ్ ఐ కి తాను మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌న్నారు. ముస్లిం లంతా అదే వ్య‌వ‌స్థ‌కు చెందిన‌వార‌నే అభిప్రాయం స‌బ‌బు కాద‌ని, అంద‌రి అభిప్రాయం తెలుసు కోకుం డానే ముద్ర‌వేసి నిషేధించ‌డం, వేధించ‌డం యావ‌త్ ముస్లింల‌పై నిషేధంతో స‌మాన‌మ‌ని ఓవైసీ మండి ప‌డ్డారు. అస‌లు యూఏపిఏ చ‌ట్టాన్నే తాను వ్య‌తిరేకిస్తున్నాన‌ని ఓవైసీ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం తూట్లు పొడుస్తోంద‌ని ఓవైసీ ఆరోపించారు. 

అయితే ఆర్ ఎస్ ఎస్‌లో ఉన్న‌వారిలో చాలామంది ఇప్ప‌టికీ మంచివారున్నార‌ని 2003 నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌శంసిస్తూనే వ‌చ్చారు. అంతేకాదు ఆర్ ఎస్ ఎస్‌ను దేశ‌భ‌క్తులుగానూ అప్ప‌ట్లో కీర్తించారు. అందుకే ఆమెను దుర్గారూపిణిగా ఆర్ ఎస్ ఎస్ అభివ‌ర్ణించింద‌ని ఓవైసీ అన్నారు. మమత వ్యాఖ్యలపై బెంగాల్ ఇమాం అసోసియేష‌న్ చీఫ్ మ‌హ్మ‌ద్ యాహ్య  కూడా స్పందిస్తూ 20 కోట్ల మంది ముస్లింలు మ‌మ‌తా బెనర్జీని సెక్యుల‌ర్ నేత‌గా భావిస్తున్నరని తెలిపారు. కానీ, ఆమె మాట‌లు అర్ధంలేకుండా ఉన్నా య‌న్నారు. దేశంలో బీజేపీ త‌న ప్రాభ‌వం కోసం విప‌క్షాల మీద ఈ విధంగా విరుచుకుప‌డ‌టం, విభేదాలు సృష్టించడంలో ఆనందిస్తోంది గాని ఇది తిరిగి విప‌రీత ప్ర‌భావం చూపుతుంద‌న్న వాస్త‌వా న్నికూడా గ్ర‌హించాలి.  

ఒక‌రి అనుమానాన్ని స‌త్య‌మ‌ని ప్ర‌చారం చేసి అదే న‌మ్మించేలా చేసి మీవాళ్లు మావాళ్ల కంటే ఘ‌నుల‌ని భుజాలు చ‌ర‌చుకుంటే విప‌క్షాలు దుమ్మెత్తిపోయ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో  అడ్డంకుల‌ను కూడా సృష్టిం చి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తి కుర్చీకే ఎస‌రు రావ‌చ్చ‌న్న‌ది బీజేపీ గ్ర‌హించాలి. అందువ‌ల్ల పిడ‌క‌ల వేట‌ను ఇంత‌టితో ఆపాలి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News