కాపలా కుక్కల్లా కాదు..గుంట నక్కల్లా
posted on Jun 21, 2013 6:55PM

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలనే దోచుకుంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ పట్ల గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, వాళ్ళ శవాల మీద పునాదులు నిర్మించుకున్నారని ఆరోపించారు. భూవివాదంలో కేటీఆర్ కు భాగస్వామ్యం లేకపోతే, అసెంబ్లీలో నిన్న టీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ తమ అసలు రంగు ఎక్కడ బయటపడుతుందోనని టీడీపీపై ఎదురుదాడికి దిగిందని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఉంది కాబట్టే ప్రజలు మిమ్మల్ని భరిస్తున్నారని, లేకపోతే తరిమికొట్టేవారన్నారు. భూవివాద వ్యవహరంలో భువనేశ్వర్ జైల్లో సతీష్‌రెడ్డి ఉన్నమాట నిజం కాదా, కిడ్నాప్‌పై శ్రీనివాస్‌రావు కుమార్తెల ఆరోపణలు నిజం కాదా?, సతీష్‌రెడ్డిని పట్టించుకోవడం లేదని అతని సోదరులు చెప్పిన మాట నిజం కాదా అని రేవంత్ ప్రశ్నించారు.