రేవంత్ ముందుంది అసలు పండగ...

 

పార్టీ మారిన తరువాత ముందు బాగానే ఉంటుంది. ఆ తరువాతే అసలు సమస్య అంతా. కనీసం పేరు కూడా ఎక్కడా వినిపించదు. అది ఎర్రబెల్లి విషయంలోనే అర్ధమయి ఉండాలి రేవంత్ రెడ్డికి. ఎర్రబెల్లి ఆవేశంగా టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు కనీసం ఎర్రబెల్లి పేరు కూడా ఎక్కడా వినిపించడంలేదు. కనీసం టీడీపీలో ఉంటే అయినా.. సీనియర్ నేతగా ఏదో ఒక పదవిలో ఉండేవాడు. ఇవన్నీ తెలిసీ కూడా రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. కాంగ్రెస్ పార్టీ మొత్తం తన మాట మీదే నిలబడుతుందని... తాను ఏది చెబితే నాయకులు గొర్రెల్లా తల ఊపుతారని..పార్టీ మొత్తం తనదే అన్నట్టు తెగ ఎగరిపడ్డాడు.  కానీ సీన్ రివర్స్ అయింది. ఒక్కసారిగా రేవంత్ గాలి తీసేశాడు జానారెడ్డి. ముందు రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీ ఫేట్ మారిపోతుందని.. కాంగ్రెస్ పార్టీలోకి బాహుబ‌లి వ‌స్తాడ‌ని అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి వెళ్లిన తరువాత మాట తీరు మారిపోయింది. బాహుబలులు ఇప్పటికే వచ్చారని…. ఇంకా వస్తారని చెప్పుకొచ్చారు. సినిమాలో వచ్చే బాహుబలి కాదు…ఇంకెంత మంది బాహుబలులు వస్తారో మీరే చూస్తారని జానారెడ్డి అన్నాడు. అంటే రేవంత్ ఏదో పెద్ద తోపు అన్న‌ట్లుగా కాద‌ని తేల్చిపారేశారు. పాపం ఇవన్నీ ఏం తెలయని రేవంత్ తానేదో నిజంగానే తోపు అని... కాంగ్రెస్ పార్టీలో ఇక తనదే హవా అని అనుకుంటున్నాడు. నిజానికి రేవంత్ రెడ్డిలాంటి రాజకీయ అనుభవం ఉన్న వాళ్లకు ముందే తెలియాలి. పార్టీలోకి రప్పించుకునేంత వరకూ మన కన్నా తోపు ఎవరూ లేరన్నట్టు మాట్లాడతారు. వన్స్ పార్టీలోకి వచ్చిన తరువాత కూరలో కరివేపాకును తీసేసినట్టు తీసేస్తారని. మరి ముందు ముందు ఇంకేం జరుగుతుందో చూద్దాం..