కేసీఆర్, బాబుల ఫ్రెండ్‌షిప్ పై రేవంత్ రెడ్డి..
posted on Jan 11, 2016 11:02AM

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అధికార పార్టీపై విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కేసీఆర్.. చంద్రబాబు ఇద్దరూ సన్నిహితంగా ఉన్న తాను మాత్రం ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉంటానని.. వారి ఫ్రెండ్‌షిప్ తన చేతులు కట్టేయలేదని అని రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. కెసిఆర్ మిత్రుత్వం తెరాసపై రేవంత్ రెడ్డి చేయి కట్టేసినట్లయిందనే వాదనలు వినిపిస్తున్నాయని అడగ్గా ఆయన పైవిధంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కెసిఆర్ ఒకటి రెండుసార్లు కలిశారని, అలాంటప్పుడు మంత్రి కెటిఆర్ ప్రధాని పైన, బిజెపి పైన విమర్శలు చేయడం లేదా అని తిరిగి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని చెప్పారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి - బిజెపి గెలుపు ఖాయమని.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి పునర్వైభవం కోసం పాకులాడటం లేదని, ఇప్పటికి తమ పార్టీకి నగరంలో పట్టు ఉందని వ్యాఖ్యానించారు.