చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి విజయవాడలోని ఏసీబీ కోర్టు మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన రిమాండ్  గురువారం (అక్టోబర్ 5)తో ముగియనుండగా ఆ రిమాండ్ ను   ఈ నెల 19 వరకు కోర్టు పొడిగించింది.

అయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుల విచారణ సందర్భంగా  ఇటు చంద్రబాబు, అటు సీఐడీ తరఫు న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు.  

స్కిల్ కేసులో చంద్రబాబుకు విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దానిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక చంద్రబాబు బెయిలు పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఏసీబీ కోర్టు విచారణను శుక్రవారం (అక్టోబర్ 6)కు వాయిదా వేసింది.

కాగా చంద్రబాబు తరఫున ఈ కేసులో సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున   అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu