చేతులు కాళ్ళు వణుకుతున్నాయా... అయితే మీకూ ఈ ప్రమాదం ఉండొచ్చు!

చాలా మందికి కూర్చున్నప్పుడు  చేతులు లేదా కాళ్లు తరచుగా వేగంగా వణుకుతుంటాయి.  శరీరాన్ని సక్రమంగా  నియంత్రించడంలో  సమస్య ఏర్పడుతుంటుంది. ఈ లక్షణాలు ఉంటే మాత్రం దాన్ని లైట్ గా తీసుకోవడానికి లేదు. ఈ లక్షణాలు నాడీ వ్యవస్థకు సంబంధించినవిగా పరిగణిస్తారు. దీన్ని చాలా ప్రమాదకరమైన  పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలుగా కూడా చెబుతారు.  కదలికను నియంత్రించే మెదడులోని నాడీ కణాలలో సమస్య కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో నరాల కణాలు చనిపోయిపోతాయి  లేదా క్షీణిస్తాయి. ఇది డోపమైన్ అనే ముఖ్యమైన రసాయనాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. డోపమైన్  అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే కణాలలో 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ నష్టం కలిగిన వారిలో  పార్కిన్సన్ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.  మనిషిలో సంతోషాన్ని కలిగించే న్యూరోట్రాన్స్మిటర్లలో డోపమైన్ ఒకటి.

పార్కిన్సన్స్ వ్యాధి..

ప్రతి సంవత్సరం 60,000 కొత్త పార్కిన్సన్స్ వ్యాధి కేసులు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితి సాధారణంగా 55 ఏళ్ల తర్వాత వస్తుంది.  అయితే ఇది 30-40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి   మెదడులో ఉండే అత్యంత సాధారణమైన మోటార్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నప్పుడు, దాని లక్షణాలు కూడా పెరుగుతాయి. వ్యాధి  తరువాతి దశలలో  మెదడు పనితీరు తరచుగా ప్రభావితమవుతుంది, ఇది చిత్తవైకల్యం వంటి లక్షణాలు, ఇంకా నిరాశకు దారితీస్తుంది.

పార్కిన్సన్స్ వ్యాధి  లక్షణాలు..

పార్కిన్సన్స్ వ్యాధి శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో అవయవాలు,  దవడ  వణుకు లేదా అసంకల్పిత కదలిక ఉంటాయి. ఈ లక్షణాలలో అత్యంత సాధారణమైనవి కండరాల దృఢత్వం, భుజాలు లేదా మెడలో నొప్పి రావడం. మానసిక పరిస్థితిలో మార్పు లేదా స్పందించే  సమయం తగ్గుతుంది.  కనురెప్పలు ఆర్పే వేగం తగ్గుతుంది.
 నడకలో  స్థిరత్వం ఉండదు.  డిప్రెషన్ లేదా డిమెన్షియా ప్రమాదం ఉంటుంది.

పార్కిన్సన్స్ వ్యాధి ఎవరికి వస్తుంది?

 కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు ఈ సమస్య ఉంటే, ఆ కుటుంబ సభ్యులు  కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది. అదనంగా, పార్కిన్సన్స్ వ్యాధిని మహిళల కంటే పురుషులలోనే  ఎక్కువగా వస్తుంది. టాక్సిన్స్ ఎక్కువగా ఉండే వ్యక్తులు కూడా దీని బారిన తొందరహా పడతారు.

పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స,  నివారణ

ఈ వ్యాధి ఉన్న రోగుల పరిస్థితి, దాని లక్షణాలను బట్టి ఈ వ్యాధి నియంత్రించడానికి  మందులు,  చికిత్స ఉంటుంది. దీని ద్వారా నాణ్యమైన జీవినశైలి అందించడానికి   ప్రయత్నాలు చేస్తారు.

పార్కిన్సన్స్ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల లేదా యాదృచ్ఛికంగా కూడా సంభవిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. అయినప్పటికీ, క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం ద్వారా  పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదాన్ని  తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

                                                              *నిశ్శబ్ద.