బిగ్ బాస్ బ్యూటీ సొంత విల్లాలో రేవ్ పార్టీ.. 11 మంది అరెస్ట్?

బిగ్ బాస్ ఫేమ్ హిమజకు సంబంధించిన ఒక న్యూస్ రీసెంట్ గా  టాప్ హెడ్ లైన్స్ లో వచ్చిన విషయం తెలిసిందే.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తన సొంత విల్లాలో రేవ్ పార్టీ చేసుకున్నట్లు, ఈ పార్టీపై పోలీసులు దాడి చేసి హిమజ సహా 11 మందిని అరెస్ట్ చేసినట్లు ఓ వార్త అయితే తెగ హల్ చల్ చేస్తోంది. అయితే ఆ వార్త పూర్తిగా అవాస్తవమంటూ  హిమాజ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో తాను  దీపావళి పండుగను కొత్త ఇంటిలో ఘనంగా జరుపుకుంటుంటే  కొన్ని ఛానల్స్,   ఫేక్ యాప్ లు తనపై  తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు.  అటువంటి వార్తల్ని నమ్మొద్దంటూ హితవు పలికారు. తన  ఇంట్లో పార్టీ జరిగిన మాట వాస్తవమేననీ, ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో  పోలీసులు   తన ఇంట్లో  సోదాలు  చేశారని  తెలిపిన ఆమె.. పోలీసులకు తాను    సహాకరించానన్నారు. 

తనపైన తన పార్టీకి వచ్చిన వారి పైన కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం వంటివేవీ జరగలేదని స్పష్టం చేశారు. కొత్త ఇంట్లో దీపావళి వేడుకల కోసం సన్నిహితులను పిలిచానని, పూజా కార్యక్రమాలు నిర్వహించానని హిమజ వెల్లడించారు.  తాను అరెస్ట్ అయ్యానన్న వార్తలతో తనకు  ఫోన్లు వస్తున్నాయని వాటన్నిటికీ చెక్ పెట్టడానికీ,  అందరికీ వాస్తవం ఏంటో తెలియాలనే ఉద్దేశంతోనే  ఇలా లైవ్ లోకి వచ్చినట్లు హిమజ తెలిపారు.  బిగ్ బాస్ 3 వ సీజన్ లోకి ఎంట్రీ తో హిమజ  బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందూ, ఆ తరువాత కూడా అడపాదడపా కొన్ని సినిమాలలో నటించినా  బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ మాత్రమే హిమజను ప్రజలలో గుర్తుండిపోయేలా చేసింది.  అయితే తాజాగా తన నివాసంలో రేవ్ పార్టీ వార్తలను ఖండిస్తూ  రిలీజ్ చేసిన ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ ని హిమజ క్లోజ్ చేసేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News